Advertisement

చెన్నై లోని మొసళ్ల వనం, మెరీనా బీచ్

By: chandrasekar Thu, 20 Aug 2020 5:15 PM

చెన్నై లోని మొసళ్ల వనం, మెరీనా బీచ్


మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ ట్రస్ట్.. సరీసృపాల జంతుప్రదర్శనశాల, హెర్పెటాలజీ పరిశోధనా కేంద్రం, 14 జాతుల మొసళ్లు, 10 జాతుల తాబేళ్లు, వివిధ రకాల పాములు, పక్షులకు నిలయంగా ఉంది. చెన్నైకు దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జూ అంతరించిపోతున్న మగ్గర్ మొసలి, ఉప్పునీటి మొసలి, ఘారియల్ అనే మూడు జాతులను రక్షించడానికి స్థాపించబడింది. మీరు ఈ జంతు ప్రదర్శనశాలను కాలినడకన అన్వేషించినప్పుడు రక్షిత ప్రాంతంలో ఎండలో సేదతీరే మొసళ్లు, ఇసుక దిబ్బల్లో విశ్రాంతి తీసుకునే తాబేళ్లు, చెట్లపై పాకుతూ వెళ్లే పాములను కూడా చూడవచ్చు. గిండీ నేషనల్ పార్క్ పక్కనే ఉన్న జూలో సరీసృపాల గురించి పుస్తకాలు ఉంటాయి.

crocodile,forest,marina,beach,in chennai ,చెన్నై, లోని మొసళ్,ల వనం, మెరీనా, బీచ్


మెరీనా బీచ్ భారతదేశంలో అతిపొడవైన సహజ నగర బీచ్, 13 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న ఈ మెరీనా బీచ్. మాయామి తరువాత ప్రపంచంలో రెండవ అతిపొడవైన బీచ్ గా మెరీనా గుర్తింపు దక్కింది. ఇది ఉత్తరాన ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుండి దక్షిణాన బెసెంట్ నగర్ వరకూ ఉంటుంది. సముద్రపు గాలితో ఈ ప్రాంతం చల్లబడినప్పుడు ఉదయాన్నే సందర్శించడం చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది.

సాయంత్రం అయితే నగరంలోని నివాసితులు, పర్యాటకులతో ఈ ప్రాంతం కిక్కిరిసి కనిపిస్తుంది. ఇక్కడ సాయంత్రం వేళ సమయం గడిపేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు మెరీనా బీచ్ లో ఎంతో మనోహరంగా అనిపిస్తాయి. ఈ ప్రాంతంలో అనేక మంది రాజకీయ నాయకుల విగ్రహాలు, సమాధులతో పాటు స్మారక చిహ్నాలు కూడా కనిపిస్తాయి. మెరీనా బీచ్ లో దొరికే ఆహారపదార్ధాలు సందర్శకులకు చక్కని టైమ్ పాస్ ఇస్తాయి. చెన్నై వెళ్లే వారు మెరీనా బీచ్ ను చూడకుండా తిరుగు ప్రయాణం కాలేరు.

Tags :
|
|
|

Advertisement