Advertisement

  • దాంపత్య జీవితం అద్భుతంగా సాగాలి అంటే ఇలా చేయండి...

దాంపత్య జీవితం అద్భుతంగా సాగాలి అంటే ఇలా చేయండి...

By: Sankar Fri, 17 July 2020 12:42 PM

దాంపత్య జీవితం అద్భుతంగా సాగాలి అంటే ఇలా చేయండి...



భార్య భర్తల బంధం అనేది ఒక అద్భుతమైన రిలేషన్ ..అప్పటిదాకా ఒకరికి ఒకరు అంతగా పరిచయం లేకపోయినా భార్య భర్తలుగా మారగానే ఒకరికి ఇంకొకరు సర్వస్వముగా మారిపోతారు ..అయితే కలకాలం కలిసి ఉండాల్సిన ఈ దాంపత్య జీవితంలో అపుడప్పుడు మనస్పర్థలు రావడం సహజం ..అయితే అవి ఎక్కువగా రాకుండా ఎల్లప్పుడూ ఆనందంగా గడపాలి అంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది ..

1. మీ బంధం మధ్యలో ఫోన్ ప్రభావం అంతగా ఉండకూడదు. అందుకే మీరు మీ భాగస్వామితో గడిపే సమయంలో ఫోన్‌ని పక్కనపెట్టడం మరిచిపోవద్దు. ఇంపార్టెంట్ విషయమైతేనే ఫోన్ అటెంప్ట్ చేయండి. లేకపోతే వదిలేయడం మంచిది. లైఫ్ పార్టనర్ ఎదురుగా అధికంగా ఫోన్ వాడడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు కచ్చితంగా ఫోన్ పక్కనపెట్టడం అలవాటు చేసుకోండి. దీని వల్ల మీ పార్టనర్‌తో మీరూ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయగలుగుతారు

2. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో ఎవరూ ఫ్యామిలీ లైఫ్‌ని అంతగా పట్టించుకోవడం లేదు. కానీ, మీ పార్టనర్‌తో గడిపేందుకు ఒక రోజుని కేటాయించుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజుని డెడికేట్ చేయండి. వారితో డేట్‌కి వెళ్లండి. అలా చేయడం వల్ల మీ మధ్య బంధం మరింత బాగుంటుంది.

3. పార్టనర్స్ ఎవరైనా సరే ఏదైనా మంచి పనిచేస్తే ఒకరినొకరు మెచ్చుకోవడం మరవొద్దు. ఉదాహారణకి వంట బాగా చేస్తే భార్యని భర్త మెచ్చుకోవడం వల్ల ఆ వంట చేసేందుకు అప్పటివరకూ భార్య పడిన కష్టాన్ని మొత్తం మరిచిపోతుంది. ఇదే భర్త విషయంలోనూ ఏదైనా తను మంచి పని చేస్తే భార్య మెచ్చుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ఓ సానుకూల బంధం ఏర్పడుతుంది.

4. మీకంటూ కాస్తా సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో ఆనందంగా సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరికంటూ ఓ సమయం ఏర్పడుతుంది. ఆ సమయంలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి రిలేషన్ షిప్ అయినా ఆనందమయంగా మారుతుంది.


Tags :
|
|
|

Advertisement