Advertisement

  • ఆవేశాలకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు

ఆవేశాలకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు

By: Sankar Mon, 22 June 2020 2:58 PM

ఆవేశాలకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు



ప్రేమ ఈ రెండు పదాలను వర్ణించడానికి మాటలు సరిపోవు , రాయడానికి పుస్తకాలు సరిపోవు , సముద్రం లోతు ఎంత ఉందొ అయిన చెపొచ్చు కానీ , ప్రేమ యొక్క అర్ధాన్ని చెప్పడం మాత్రం చాల కష్టం ..అయితే ఈ ప్రేమ అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ..కొంతమంది తమ ప్రేమను సాధించుకోవడం కోసం ఎంత కష్టమైన పడి ఒక ఉన్నత స్థానంలోకి ఉంటుంటే, మరికొంత మంది మాత్రం ఆ ప్రేమ మైకంలో పడి తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు..

జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే సమాజం కూడా వారిని తప్పు పట్టడం లేదు ..అయితే ఈ కాలం యువత మాత్రం ప్రేమనే మాయలో పడి తప్పటడుగు వేస్తారు. అమ్మాయిలు, అబ్బాయిలు స్నేహభావంతో మెలగాల్సిన క్రమంలో చెడు ఆలోచనలకు దారి తీస్తోంది. దీంతో విద్యాభ్యాసానికి చెక్‌ పెడుతున్నారు. కన్నవారి కలలు దూరం చేస్తూ కష్టాల సుడిగుండంలో పడుతున్నారు.

ప్రేమ మాయలో పడిన యువత పెద్దల మాటలు వినకుండా రహస్యంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, ఆలయాల్లో స్నేహితుల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ కులం, మతం కాని వాడిని పెళ్లి చేసుకుందని తీవ్ర మనోవేదనకు లోనవుతారు. సమాజం, బంధువులు, ఇరుగు పొరుగు వారు తమను చిన్నచూపు చూస్తారనో, కుటుంబ పరువు, ప్రతిష్ట దిగజారిందనే ఆవేశంలో సొంత బిడ్డలను సైతం హత్యచేసి పరువు దక్కిందని భావిస్తుంటారు. చివరకు కుటుంబ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు.

జాతి, మతం, కులమంటూ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలోనూ చాలామంది కట్టుబాట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పట్టణాల్లో అంతగా కనిపించకపోయినా పల్లెల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. తమ పిల్లలు తప్పు చేస్తే పరువు పోతుందనే ఆలోచనలో ఉంటారు.అయితే పిల్లలు కూడా తల్లితండ్రి చెప్పే వాటిలో మంచి ఉంటె వాటిని వినాలి జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి వంటి వాటి గురించి ఆలోచించాలని ప్రజలు అంటున్నారు ..తల్లి తండ్రులు కూడా తమ పిల్లల ప్రేమలో ఉన్న నిజాయితీని గుర్తించాలని ఆవేశాలకు పోయి జీవితాలను పాడు చేసుకోవద్దు అని సూచిస్తున్నారు


Tags :
|

Advertisement