Advertisement

  • క‌వ‌ల‌లు పుడితే తల్లిదండ్రులకు డబుల్ సంతోషం

క‌వ‌ల‌లు పుడితే తల్లిదండ్రులకు డబుల్ సంతోషం

By: chandrasekar Fri, 26 June 2020 2:23 PM

క‌వ‌ల‌లు పుడితే తల్లిదండ్రులకు డబుల్ సంతోషం


క‌వ‌ల పిల్ల‌లు పుడితే తల్లిదండ్రుల సంతోషం అంతాఇంతా కాదు. ఇద్ద‌రూ ఒకేలా ఉండ‌డం. ఒకేర‌కం దుస్తులు ధ‌రించ‌డం. ఒక‌రు ఏడిస్తే మ‌రొక‌రు బాధ ప‌డ‌డం. కాన్పు త‌ర్వాత నుంచి వారికి ఊహ తెలిసేంత వ‌ర‌కు పెంచ‌డానికి కాస్త ‌క‌ష్టంగా ఉన్న‌ప్ప‌టికీ త‌ర్వాత అంత హ్యాపీడేసే ఇద్ద‌రూ ఒకే క్లాస్‌. ఇంట్లో క‌లిసి మెలిసి త‌ల్లి ముందు తిరుగుతుంటే ఎంత బాగుంటుందో. ఇలా క‌ల‌లు కంటుంటున్నారు చాలామంది మ‌హిళ‌లు.

క‌వ‌ల పిల్ల‌లు కావాలంటూ దేవుడికి మొక్కుకునేవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఎలాంటి వారికి క‌వ‌ల పిల్ల‌లు పుడ‌తారు అనే దానికి నిపుణులు కొన్ని విష‌యాలు చెప్పుకొచ్చారు.

చాలా యేండ్ల నుంచి పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డంతో ట్రీట్‌మెంట్ తీసుకొని ఒక‌సారిగా ఆపేసి, పిల్ల‌ల కోసం ప్లాన్ చేస్తే అండాలు రెండూ అంత‌కంటే ఎక్కువ విడుద‌ల అవుతాయి. అలాంటి వారికి కూడా ట్విన్స్ పుట్టే అవ‌కాశం ఉంటుంది.

ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యే మహిళల్లో మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకునే వారికి కూడా కవల పిల్లలు పుడతారని నిపుణులు చెబుతున్నారు.

parents,double,happy,twins,are born ,క‌వ‌ల‌లు, పుడితే, తల్లిదండ్రుల, డబుల్, సంతోషం


సాధారణంగా ప్రెగ్నెన్సీ, బీఎంఐకి సంబంధం ఎక్కువగా ఉంటుంది. బీఎంఐ 30 కన్నా ఎక్కువగా ఉంటే మహిళలకు కవల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

ఇంకో ముఖ్య‌మైన విష‌యం పాలు, వెన్న, చీజ్ ఎక్కువగా తీసుకునే వారికి కూడా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పాలల్లో ఎదుగుదలకు అవసరమ‌య్యే ఇన్సులిన్ ఉండ‌డ‌మె.

కొంత‌మందికి ఇవేవీ చేయ‌క‌పోయినా స‌హ‌జంగానే ట్విన్స్ పుడ‌తారు. మ‌రికొంత‌మందికి కావాల‌న్నా పిల్ల‌లు పుట్ట‌రు.

Tags :
|
|
|

Advertisement