Advertisement

  • భార్య భర్తల బంధం బలపడాలి అంటే భర్తలు ఈ తప్పులు చేయకండి ..

భార్య భర్తల బంధం బలపడాలి అంటే భర్తలు ఈ తప్పులు చేయకండి ..

By: Sankar Sun, 05 July 2020 6:01 PM

భార్య భర్తల బంధం బలపడాలి అంటే భర్తలు ఈ తప్పులు చేయకండి ..



బంధం నిలుపుకోవాలంటే స్త్రీ, పురుషులిద్దరూ కొన్ని నియమాలను పాటించాలి. ఇందులో ముఖ్యంగా పురుషులు.. కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ కారణంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. అలా కాకుండా.. తమ బంధాన్ని బలపర్చుకోవాలంటే..ఈ తప్పులు అస్సలు చేయకూడదు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. పురుషులు చేసే సాధారణ తప్పిదాలలో ఒకటి భాగస్వామిని సరిగా అర్థం చేసుకోకపోవడం ..మీరు ఆమె చేసే పనులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆమె చేసే ప్రతిపనికీ ఒక కారణం ఉండొచ్చు. దీనివల్ల.. మీకు సమస్య ఎదురైతే.. వెంటనే ఆమెతో మాట్లాడి ముందుముందు వచ్చే గొడవలను, అపార్ధాలను తొలగించుకునే ప్రయత్నాలు చేయండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, ఆమెని ప్రశ్నలను అడిగి విషయం తెలుసుకోవాలి. అంతేకానీ, ఆమెతో వాదించడం, గొడవకు దిగడం సరికాదు.. కాబట్టి ముందుగానే ఆమెతో మాట్లాడడం చాలా మంచిది.

2. పురుషులు చేసే అతి పెద్ద తప్పు .. భాగస్వామిని నమ్మకపోవడం.. బంధాన్ని బలపర్చడంలో ఇది చాలా కీలకం. భాగస్వామిపై అనుమానం వారికి అవమానమేనని గుర్తుంచుకోవాలి. ఓ రకంగా చెప్పాలంటే.. మహిళలు మానసికంగా పురుషులను ఎక్కువగా ప్రేమిస్తారు. అదేవిధంగా.. వారితో సంతోషంగా గడపాలని అనుకుంటారు. అంతేకానీ, అనుమానించడం.. ఇబ్బంది పెడితే వారు సహించలేరు. కాబట్టి.. ఎలాంటి అనుమానాలు ఉండకూడదు.

3. అందరూ ఒకేలా ఆలోచించరు. ఒక్కొక్కరికీ ఒక్కో విధమైన ఆలోచన ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. అందరూ మనలానే ఆలోచిస్తారని అనుకోవద్దు.. మీ భాగస్వామి మీకు ఏ విషయం గురించైనా చెబుతుంటే.. దాన్ని పట్టించుకోవాలి. అంతేకానీ, అస్సలు విస్మరించకూడదు. పట్టించుకోవడమంటే కేవలం ఆమె చెప్పేది వినడమే కాదు.. దానిపై స్పందించాలి. తనకు ఏదైనా హెల్ప్ కావాలో చూడాలి.. సాధ్యమైనంత వరకూ సాయపడాలి. అదే విధంగా.. తాను ఏం చెప్పదలుచుకుందో అది మొత్తం వినాలి. ఈ విషయంలో తను బాధపడేలా మాట్లాడొద్దు. ఇలా చేయడం వల్ల మీరు ఆమె మనసులో స్థానాన్ని పదిలపరుచుకుంటారు.

4. బంధం విషయంలో నమ్మకం, గౌరవం అనేవి పునాదులు వంటివి. అందుకే ఒకరిని ఒకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఆమె కలలను, ఆమె మాటలను ఆమెకు సంబంధించిన విషయాలను మీరు గౌరవించాలి. మీరు వారి నుండి నమ్మకం, గౌరవం ఆశిస్తుంటే..అదే నమ్మకాన్ని, గౌరవాన్ని వారిపై మీరు కలిగి ఉండాలని గుర్తుంచుకోవాలి. మీలానే, ఆమె అభిరుచులు మరియు లక్ష్యాలు కూడా సమానమని గుర్తుంచుకోవాలి. ఆమె తీసుకునే నిర్ణయాలలో సరైన మద్దతునివ్వండి, ఆమె వృత్తి పరంగా, లేదా సామాజికంగా ఆమె అభిరుచులకు తగినట్లుగా ఎదగడానికి సహాయపడండి. మీ ఈ అలవాటు, మీమధ్య మంచి సంబంధం ఏర్పడడానికి మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది.




Tags :
|
|

Advertisement