Advertisement

భార్య భర్తల మధ్య ప్రేమ

By: chandrasekar Mon, 25 May 2020 5:22 PM

భార్య భర్తల మధ్య ప్రేమ


భార్య భర్తల మధ్య ప్రేమ ఎక్కువ కావడానికి ఉపయోగపడే చిట్కాలు.

ప్రేమ అనే విషయం గురించి చెప్పాలని చాలా మంది అనుకుంటారు.. కానీ, ఆ ప్రేమని సరిగ్గా తెలియజేయడం అందరికీ తెలియదు.. అలాంటి వారు మీరు ప్రేమించేవారికి మీ మనసులోని ప్రేమని ఎలా తెలియజేయాలో కొన్ని సూచనలు.

* రోజులో ఎక్కవ సమయం మీరు ఇష్టపడే వారితో గడపండి. బంధం బలపడడానికి అన్నింటికంటే ఇదే ముఖ్యం. వారిని వారి ఇష్టాలను గౌరవించండి. మీ ఇద్దరూ కలిసి ఉన్నంత మాత్రాన మీ ఇష్టప్రకారం వారు మారాలని మీరు అనుకోవడం కరెక్ట్ కాదు.

* ప్రేమలో గౌరవం కలిసి ఉండకూడదని ఎక్కడా లేదు. మీ సంభాషణల్లో వారికిచ్చే గౌరవాన్ని ఇవ్వండి. ఎదుటివారు మీకెంత ముఖ్యమో చెబుతూ ఉండండి.

* ఇద్దరికి ఇష్టమైన వంట చేయండి. మీ ఇద్దరూ కలిసి ఉన్న ఓ పాత ఫోటోని ఫ్రేం కట్టించి వారికి గిఫ్ట్ గా ఇవ్వండి.

* ఎప్పటికప్పుడు ఎదుటివారిని ఆశ్చర్యపరచండి. మీరు చేసే పనుల్లో వారి సలహా అడగండి.

love,between,husband,and,wife ,భార్య, భర్తల, మధ్య, ప్రేమ, ప్రేమ


* రెగ్యులర్ గా వెకేషన్స్ ప్లాన్ చేసుకోండి. ఎదుటివారి హాబీస్ లో మీరూ ఉత్సాహంగా పాల్గొనండి. పిల్లలు పక్కన లేనప్పుడు దగ్గరగా ఉండండి.

* ఖాళీ గా ఉన్నప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఆలోచించండి. కలిసి నవ్వుకోండి. జోక్ కావచ్చు, సీరియల్ కావచ్చు - ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయండి.
* బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళినప్పుడల్లా ఆయన బ్రీఫ్ కేస్ లో కొన్ని లవ్ నోట్స్ దాచండి. కలిసి పనులు చేస్తుండండి. రాత్రి భోజనం ఇద్దరూ కలిసే చేయాలనే నియమం పెట్టుకోండి.

* రోజు ఎలా గడిచిందో కలిసి ఆ విషయాలను పంచుకోండి. పెద్ద పెద్ద నిర్ణయాల్లో వారి మాటలకి విలువివ్వండి. బాగా అలిసిపోయి ఇంటికొచ్చినప్పుడు ఒక మంచి మసాజ్ ఇవ్వండి.

* వారికి ఇష్టమైన పనులు చేయండి. కలిసి పనులు పంచుకోండి. బట్టలు ఇస్త్రీ చేసి పెట్టండి. పొద్దున్న ఆయన ఆఫీస్‌కి వెళ్తున్నప్పుడు ఒకరికి ఒకరు సాయం చేసుకోండి.

* రెగ్యులర్ గా 'ఐ లవ్ యూ' అని మెసేజెస్ పెడుతూ ఉండండి. ఇంట్లో ఏమైనా మార్పులు చేస్తుంటే ఎదుటివారి ఇష్టాఇష్టాలు గుర్తుపెట్టుకోండి. వీక్నెస్ లు మర్చిపోయి, బలాల మీద ఫోకస్ చెయ్యండి.

love,between,husband,and,wife ,భార్య, భర్తల, మధ్య, ప్రేమ, ప్రేమ


* పిల్లల ధ్యాసలో పడి ఒకరినొకరు పట్టించుకోవడం మర్చిపోకండి. మీకు ఇద్దరూ ముఖ్యులే. అలిసిపోయి ఇంటికి వచ్చిన తరువాత మీ మాటలతో ఎదుటివారిని సేద తీర్చండి.

* ఒకరినొకరు మెచ్చుకుంటూ ఉండండి. వారాంతంలో మీ ఇద్దరూ కలిసి ఏదైనా టీవీ షో చూడడానికి ప్లాన్ చెయ్యండి. పెద్ద పెద్ద కొనుగోళ్ళలో ప్రతి ఒక్క విషయంలో ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించండి.

* మూడ్ బాలేకపోతే విసిగించకండి. మీ ఇద్దరి ఫోటోలూ ఇంట్లో అక్కడక్కడా పెట్టండి. పార్క్ కి వెళ్ళినా, మాల్ కి వెళ్ళినా ఎదుటివారి చేతులు పట్టుకుని నడవండి.

* మీ ఇద్దరూ కలిసి మార్నింగ్ వాక్ వెళ్ళచ్చేమో చూడండి. అది అన్నివిధాలా మంచిది. నెలకోసారైనా డేట్ ప్లాన్ చెయ్యండి. సన్నిహితంగా మెలగండి.

* ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడూ, ఇంట్లోకి వస్తున్నపుడూ ఒక హగ్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వండి. ఇంట్లో ఆయన చేసే పనులని మెచ్చుకోండి.

* ఎదుటివారిలో మీకేమిష్టమో అది మీ పిల్లలకి చెప్పండి. అనుకున్నది జరగనప్పుడు వారికి సపోర్ట్ ఇవ్వండి. ఇద్దరూ కలిసి ఒక కొత్త డిష్ ట్రై చెయ్యండి. మొత్తంగా ఇద్దరు కలిసి ఆనందంగా ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయండి.

Tags :
|
|

Advertisement