Advertisement

  • వైవాహిక జీవితంలో ప్రేమకు తీసుకోవలసిన జాగ్రత్తలు

వైవాహిక జీవితంలో ప్రేమకు తీసుకోవలసిన జాగ్రత్తలు

By: chandrasekar Sat, 20 June 2020 7:48 PM

వైవాహిక జీవితంలో ప్రేమకు తీసుకోవలసిన జాగ్రత్తలు


నూతన పెళ్లి జంటలో ప్రేమ చాల ఎక్కువగా ఉంటుంది అదే సమయంలో ఇగోను వదలి ప్రేమగా కలిసివుండడం ద్వారా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. పెళ్లయిన కొత్తలో భార్యభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంతా కేరింగ్ తీసుకుంటారు. భార్యభర్తలు పాలు నీళ్లలా కలిసిపోవాలని అంటుంటారు పెద్దలు. ఎవరైనా సరే కలకాలం ఒకరితో ఒకరు కలిసి బతకాలన్న ఆశతోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఎప్పటికైనా విడిపోవాలన్న కోరికతో ఎవరూ కూడా కొత్త బంధంలోకి అడుగుపెట్టరు.

ప్రస్తుతం కంటే పూర్వకాలంలో జీవిత భాగస్వాముల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతతో పాటు ఓర్పు, సహనం ఉండేవి. అందువల్ల వారు తుదిశ్వాస విడిచే వరకు ప్రాణానికి ప్రాణంగా బతికేవారు. కానీ నేటితరంలో ఓర్పు, సహనం అనే లక్షణాలే కరువయ్యాయి. అందుకే పెళ్లయిన జంటలు చిన్నచిన్న విషయాలకే గొడవలు పడుతుంటారు. కొందరైతే చిన్న గొడవలనే పెద్దవి చేసుకుని విడిపోయే స్టేజ్ వరకు వెళ్లిపోతారు. వివాహ బంధం తెగతెంపులు కావడానికి ప్రధానంగా మూడు విషయాలు కారణమవుతాయని ఫ్యామిలీ కౌన్సిలర్లు చెబుతున్నారు.

భార్య భర్తల మధ్య ఏర్పడే నిర్లక్ష్యం:

పెళ్లయిన కొత్తలో భార్యభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంతా కేరింగ్ తీసుకుంటారు. ఇష్ఠాయిష్టాలు తెలుసుకుని భాగస్వామి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు. అయితే కాలం గడిచే కొద్దీ పిల్లలు పుట్టడం, కుటుంబ బాధ్యతలు మీద పడటంతో ఆ ఉత్సాహం అంతా నీరుగారిపోతుంది. ఒక్కోసారి భాగస్వామిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అప్పుడే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. చికాకులు, గొడవలతో జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందువల్ల ఎన్ని పనులు, బాధ్యతలున్నా పార్టనర్‌ను నిర్లక్ష్యం చేయకూడదు.

care,love,between,husband,wife ,భార్య, భర్తల, మధ్య, ప్రేమకు, తీసుకోవలసిన జాగ్రత్తలు


భార్య భర్తల మధ్య అన్నోన్యత:

కాపురంలో భార్యభర్తల ఇద్దరి పాత్ర కీలకమే. ఒకరు ఎక్కువా కాదు మరియు మరొకరు తక్కువా కాదు. ఇద్దరూ సమానులే. కానీ కొందరు భార్యభర్తలు సంసారంలో తనదే పైచేయిగా ఉండాలని ప్రయత్నిస్తారు. భార్యపై ఆదిపత్యం చెలాయించేందుకు భర్త, భర్తను డామినేట్ చేసేందుకు భార్య ప్రయత్నిస్తే ఆ కాపురం మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసిపోతుంది. అందుకే జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించకుండా మనసెరిగి ప్రవర్తించాలి.

భార్య భర్తల మధ్య సర్దుబాటు:

కాపురంలో దంపతులిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఎదుటివారి అభిప్రాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ నా మాటే నెగ్గాలి అని ఇద్దరిలో ఎవరు అనుకున్నా అది ఏదొక రోజు సంసారాన్ని కూల్చేస్తుంది. కాబట్టి కాపురంలో భాగస్వాములిద్దరూ ఎదుటి వారిని గౌరవించుకోవాలి.

Tags :
|
|

Advertisement