Advertisement

నాన్నకు ప్రేమతో ఓ కూతురు

By: chandrasekar Wed, 17 June 2020 7:53 PM

నాన్నకు ప్రేమతో ఓ కూతురు


నాన్నకు ప్రేమతో ఓ కూతురు ఈ విశ్వంలో ఎక్కడైనా తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా ప్రేమిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే తండ్రికి కూతుళ్లపై, తల్లికి కొడుకులపై ఎనలేని మమకారం ఉంటుంది. ఇదే విషయాన్ని చాలా అధ్యయనాలు నిజమని చెప్పాయి. అయితే ఎన్ని బంధాలు ఉన్నా తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాంగం అనుబంధం మాత్రం ఎప్పటికీ తగ్గదనే చెప్పాలి.

తండ్రులు కూతుళ్లతో మంచి సంబంధాలను కొనసాగించడం అవసరమే కూడా. తండ్రులు కొడుకులతో కన్నా కూతుళ్లనే చాలా సౌకర్యంగా, సంతోషంగా ఉంటారని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుత సమాజంలో తండ్రులందరూ కూతుళ్లతో మంచి సంబంధాలను కొనసాగించడం అవసరం కూడా. ఎన్నో కుటుంబ పరిశోధనలు కూడా కూతురికి తండ్రితో ప్రేమ పూర్వకమైన బంధం సురక్షితమని స్పష్టం చేశాయి.

చిన్నప్పుడు నన్ను లాలించావు.. నాకు ఎన్నో ఆటలను నేర్పించావు.. ఎక్కడ నెగ్గాలో కాకుండా.. ఎక్కడ తగ్గాలో చూపించావు.. నా భవిష్యత్తుకై ప్రమిదలా కరిగిపోయావు.. కొంత భయపెట్టినా నన్ను ఉన్నత స్థానానికి చేర్చావు.. నా ప్రగతి కోసం ప్రతి క్షణం పరితపించావు.. అందుకే నా జీవితంలో తొలి హీరోవి అయ్యావు నాన్న.

కూతురు చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి టీనేజీ వరకు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లేదా వ్యక్తిగతంగా చాలా విషయాలను నేర్పిస్తాడు. అమ్మాయి తన జీవితంలో మెరుగైన స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. అందుకే తండ్రీ కూతుళ్ల బంధం విడదీయరానిదిగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

daughter,with love,daddy,relation,world ,నాన్నకు, ప్రేమతో, ఓ కూతురు, విశ్వంలో, తల్లిదండ్రులు


తన కూతురు ఎదుగుతున్న సమయంలో మంచి స్కూల్స్ లో చేర్పించడం, దగ్గరుండి చదివించడం, వారు డిగ్రీ పట్టా పొందే వరకు తండ్రి తర్ఫీదులో భాగమనే చెప్పాలి. అలా జీవితాంతం తండ్రి కూతురితో మంచి సానుకూల సంబంధాన్ని కొనసాగించి మంచి లక్షణాలను నేర్పిస్తాడు.

పూర్వం కూతురు వయసుకు వచ్చిన వెంటనే వివాహం చేయాలనీ అనుకునేవారు. కానీ ప్రస్తుతం తండ్రుల ఆలోచన ధోరణి బాగా మారింది. తన కూతురు, ఓ డాక్టర్, ఇంజనీర్ వంటి ఉన్నత ఉద్యోగాలు చేయాలని ఆశిస్తున్నారు. దీని వల్లే ఏ పరీక్షల్లో అయినా అమ్మాయిలే అబ్బాయిల కన్నా ముందంజలో ఉంటారు. ఆధునిక కాలంలో చాలా మంది తండ్రులు తమ కూతురు ఎందులోనూ తక్కువ కాకూడదని భావిస్తున్నారు. అందుకే తన కూతురు ఏది కోరుకున్నా ఎంత కష్టమైనా దాన్ని తెచ్చి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి చర్యలే కూతుళ్లలో ఉత్సాహం పెంచుతోంది. ఇది కేవలం మన దేశంలోనే కాదు. విశ్వవ్యాప్తంగా ఇలానే ప్రతి ఒక్క తండ్రి కోరుకుంటున్నాడు.

ఇటీవల తండ్రి మరియు కూతుళ్ల బంధంపై అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో తండ్రి కూతుళ్ల సంబంధం వల్ల అమ్మాయిల్లో విద్యా సామర్థ్యం బాగా పెరుగుతుందని తేలింది. దీన్ని నిరూపించుకునే మనం ఎక్కడో విదేశాలకు వెళ్లాల్సిన పని లేదు. మన దేశంలో, తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ పరీక్షల్లో అయినా కొన్ని దశాబ్దాలుగా వారే టాపర్లుగా నిలుస్తున్నారు. తండ్రి కూతుళ్ల మధ్య సంబంధం విద్యపై ప్రభావం చూపిందడానికి ఇదొక గొప్ప ఉదాహరణ.

తన కూతురికి తానే తొలి గురువుగా నిత్య కొత్త కొత్త విషయాల గురించి చెబుతూ వారితో కూడా అలాంటి పనులు చేయించడం వల్ల కూతుళ్లందరికీ తండ్రిపై విశ్వాసం మరింతగా పెరుగుతుంది. అలాగే ఇతరుల గురించి, వారి చేష్టల గురించి చక్కగా వివరించి చెప్పడంతో వారు బయట అబ్బాయిలతో కూడా సాధారణంగా కలిసిపోతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా అబ్బాయిలకు ధీటుగా అమ్మాయిలను పెంచుతున్నారు.

daughter,with love,daddy,relation,world ,నాన్నకు, ప్రేమతో, ఓ కూతురు, విశ్వంలో, తల్లిదండ్రులు


మాములుగా అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాట్లాడటాన్నే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. వారు పెరిగే కొద్దీ వారి స్వరం కూడా పెరుగుతుంది. అయితే తండ్రి తన కూతురు స్వరం ఎంత పెద్దదైనా తాను ఎన్ని మాటలు చెబుతున్నా సావధానంగా వింటూ ఉంటాడు. తను చెప్పే విషయాలను శ్రద్ధగా వింటాడు. అందుకే వీరిద్దరి మధ్య సంబంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

కూతురు ఇల్లు వదిలి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు, ఇంటికి దూరంగా వెళ్లినప్పుడు, చదువు గురించో ఉద్యోగం గురించో మరే ఇతర విషయాల గురించో వెళ్లినప్పుడు, వారికి దూరంగా ఉండాల్సినప్పుడు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ చక్కగా ఉపయోగపడుతుంది. వీరికి వీడియో కాల్స్ వాట్సాప్, ఫోన్ కాల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. వీటి వల్ల కూడా దూరంగా ఉన్నట్లు ఫీలవ్వడం లేదు. అయితే ఇంతకుముందు ఇవేవీ లేని సమయంలో ఉత్తరాలు రాసుకునేవారు.

వివాహం అనేది అమ్మాయిల జీవితంలో ముఖ్యమైన ఘట్టం. వివాహం తర్వాత కూతురిపై ప్రేమ తగ్గుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ తన తండ్రికి వివాహం తర్వాతనే ప్రేమ మరింత పెరుగుతుంది. ఎందుకంటే వివాహం తర్వాత ఒత్తిడికి దూరంగా ఉండటం, వారికి ఏదైనా సమస్య వస్తే వారితో పంచుకోవడం వంటి సంఘటనల వల్ల వారి మధ్య బంధం మరింత బలంగా మారుతుంది.

Tags :
|

Advertisement