Advertisement

క్యారెట్ తో స్వీట్ పాయసం

By: chandrasekar Tue, 25 Aug 2020 2:56 PM

క్యారెట్ తో స్వీట్ పాయసం


క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఎంతసేపు ఈ క్యారెట్ ‌తో కూరలు, సలాడ్స్ మాత్రమే చేస్తుంటాం. కానీ, ఈసారి కొత్తగా స్వీట్ తయారు చేద్దాం

* తురిమిన క్యారెట్: 2
* పాలు: 1 లీటర్
* నెయ్యి: 1 కప్
* జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకుల పొడి
* చక్కర: 4 టీ స్పూన్

క్యారెట్స్‌ని తురిమి పక్కనపెట్టాలి. ఓ పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి వేడి చేసి ఇప్పుడు అందులో జీడిపప్పులు, పిస్తాపప్పులు, ఎండు ద్రాక్షలు వేసి 2 నిమిషాల పాటు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. అదే పాన్‌లో క్యారెట్ వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. క్యారెట్ బాగా వేగిన తర్వాత అందులో పాలు వేసి 10 నిమిషాల వరకూ ఉడికించాలి. హల్వా ఉడికి దగ్గరపడేవరకూ ఉడకనివ్వాలి. అందులో పంచదార వేసి మరికాసేపు ఉడికించి పంచదార మొత్తం కరిగేవరకూ ఉడికించాలి. పాయసంలో నెయ్యి వేసి కలపాలి. చివరిగా డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి వేసి స్టౌ ఆపివేయాలి. ఇలా తయారైన హల్వా వేడిగా తింటే సూపర్ గా ఉంటుంది.

Tags :
|
|

Advertisement