Advertisement

  • ఆరోగ్యవంతమైన బీట్‌రూట్‌ చపాతి తయారీ

ఆరోగ్యవంతమైన బీట్‌రూట్‌ చపాతి తయారీ

By: chandrasekar Tue, 30 June 2020 8:14 PM

ఆరోగ్యవంతమైన బీట్‌రూట్‌ చపాతి తయారీ


బీట్‌రూట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతింది. భూమిలో పండే బీట్‌రూట్ ఎన్నో రకాల పోషకాలను సంగ్రహిస్తుంది. బీట్‌రూట్ నిత్యం తినేవారిలో శారీరక దారుఢ్యం పెరుగుతుంది. ‘న్యూట్రియన్ట్స్ - ఓపెన్ ఎక్సెస్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రీషన్’లో ప్రచురించిన సర్వే ప్రకారం బీట్‌రూట్‌ను నిత్యం తీనేవారికి గుండె సమస్యలు ఉండవని పేర్కొంది. ముఖ్యంగా అథ్లెట్స్ బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల వారిలో స్టామినా పెరుగుతుందని తెలిపింది. ఈ బీట్రూట్ తో రుచికరమైన చపాతీ ఎలా తాయారు చెయ్యాలో చూస్తాం.

కావలసిన పదార్థాలు:

* బీట్‌రూట్‌ గుజ్జు – 1 కప్పు తీసుకోవాలి
* గోధుమ పిండి – 1 కప్పు తీసుకోవాలి
* అల్లం – వెల్లుల్లి పేస్ట్
* పచ్చిమిర్చి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌ చొప్పున
* వాము పొడి – అర టీ స్పూన్
* ఉప్పు – తగినంత
* ఆలివ్‌ నూనె – 1 టీ స్పూన్
* నీళ్లు – సరిపడా
* నూనె – కొద్దిగా
* ఉల్లిపాయ ముక్కలు
* కొత్తిమీర తురుము – గార్నిష్‌కి

preparation,healthy,beetroot,chapati,recipe ,ఆరోగ్యవంతమైన, బీట్‌రూట్‌, చపాతి, తయారీ, పోషకాల


తయారీ విధానం:

ఒక పెద్ద బౌల్‌లో గోధుమ పిండి, బీట్‌రూట్‌ గుజ్జు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఆలీవ్‌ నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వాము పొడి కూడా అందులో వేసుకుని, కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్డంత పరిమాణంలో ముద్దలు తీసుకుని చపాతి కర్రతో చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌పైన నూనె వేసి దోరగా వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుముతో గార్నిష్‌ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యంతో బాటు రుచికరమైన బీట్‌రూట్‌ చపాతి రెడీ.

Tags :

Advertisement