Advertisement

నోరూరించే మసాలా చేపల కూర

By: chandrasekar Sat, 19 Sept 2020 09:39 AM

నోరూరించే మసాలా చేపల కూర


చేపలు కూర వండేటప్పుడే అందరికి నోరూరుతుంది. ఆ వాసన అట్టే అందరిని ఆకట్టుకుంటుంది. కమ్మని నోరూరించే మసాలా చేపల కూర తయారు చేసి రుచి చూస్తే ఆ మజానే వేరు. రుచికరమైన ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలో చూస్తాం.

మసాలా చేపల కూరకు కావాల్సిన పదార్థాలు:

చేపలు: అర కేజీ
ఆవాలు: టీ స్పూను
నూనె: పావు కప్పు
ఉల్లిపాయ: 1
టమాటాలు: 2
చింతపండు: కావలసినంత
గరం మసాలా : 1 టీ స్పూను
ఉప్పు, పసుపు, కరివేపాకు: తగినంత
నూనె: 1 టేబుల్‌ స్పూను
ఎండుమిర్చి: 10
ధనియాలు: 2 టేబుల్‌ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు: ఒక కప్పు
తాజా కొబ్బరి: అరకప్పు

చేపల కూర తయారు చేసే విధానం:

ఒక మట్టి పాత్రలో చింతపండును 10 నిమిషాలు నీటిలో నానబెట్టిన తర్వాత గుజ్జు రసాన్ని తీసి పక్కనపెట్టుకోవాలి. ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, ధనియాలు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసుకొని ముద్దలా చేసుకోవాలి. దానికి కొబ్బరి కలిపి పక్కన పెట్టుకోవాలి. మళ్లీ ప్యాన్‌లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు వేయాలి. తర్వాత టమాట ముక్కలు వేసి వేగనివ్వాలి. అందులో మసాలాను వేయాలి. తర్వాత నీరు, చింతపండు రసం కూడా వేసి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత నూనె పైకి తేలుతున్నప్పుడు చేపల ముక్కల్ని వేయాలి. మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. చివర్లో గరం మసాలా పౌడర్‌ చల్లి వేడి వేడిగా వడ్డిస్తే రుచికరంగా ఉంటుంది. దీనిని పిల్లలు నుండి పెద్దలు వరకు అందరూ ఇష్టపడి తింటారు.

Tags :
|
|

Advertisement