నోరూరించే బ్రెడ్ రసమలై
By: chandrasekar Mon, 03 Aug 2020 12:56 PM
రుచికరమైన బ్రెడ్ రసమలై
రెసిపీ ట్రై చేసి చుడండి అదిరిపోయే టేస్ట్. రసమలై అంటేనే నోరూరిపోవడం గ్యారెంటీ.
సులభంగా దీనిని ఎలా తయారుచేయాలో చూస్తాం.
తాయారు చేయడానికి కావలసిన
పదార్థాలు:
* బ్రెడ్ ముక్కలు - 4
* పాలు - 2 కప్పులు
* నెయ్యి - 1 టీస్పూన్
* కండెన్స్‌డ్ మిల్క్ - 2 టేబుల్ స్పూన్లు
* పంచదార - పావు కప్పు
* మిక్స్‌డ్ నట్స్ (పిస్తా, బాదం, జీడిపప్పు)
- 2
టేబుల్ స్పూన్లు
* కుంకుమపువ్వు - చిటికెడు
* యాలకుల పొడి - పావు టీ స్పూన్
తయారీ విధానం:
లోతు ఎక్కువగా ఉన్న ఒక
పాత్ర తీసుకోండి. లోపల చుట్టూ నెయ్యిని సన్నటి పూతలా పూయండి. ఇప్పుడు పాలు, కండెన్స్‌డ్
మిల్కూ పొయ్యండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్‌పై పెద్ద భారీ లోతు గిన్నెను
పెట్టి మీడియం మంటలో ఉడికించండి. మిశ్రమం చిక్కబడే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండండి.
చిక్కబడటం అంటే మిశ్రమం సగానికి తగ్గాలి. అలా తగ్గిన తర్వాత దాన్ని స్టవ్ పై నుంచీ
తీసి పక్కన పెట్టండి. ఐతే పాలను తిప్పుతూ తిప్పుతూ 2 టేబుల్ స్పూన్ల వేడి
పాలను గిన్నెలోంచీ తీసుకొని వేరే గిన్నెలో పొయ్యాలి. ఆ గిన్నెలో కుంకుమపువ్వును
పొడుంలా చేసి వెయ్యండి.
1. ఇప్పుడు కుంకుమపువ్వుతో ఉన్న పాలను స్టవ్‌పై పెట్టి
ఉడికిస్తూ అందులో పంచదార వేసి కలుపుతూ ఉండండి. దీన్ని రబ్రీ అంటారు.
2. రబ్రీని కలుపుతూ మంట కాస్త తగ్గించండి. ఇప్పుడు నట్స్‌ను
నెయ్యిలో వేపి వాటిని రబ్రీలో వేసి బాగా
కలపండి. ఈ మిశ్రమానికి యాలకుల పొడి కూడా వేసి మళ్లీ కలపండి.
3. రబ్రీ చిక్కగా అవ్వగానే స్టవ్ ఆపేసి దాన్ని ఫ్రిజ్‌లో
పెట్టండి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకోండి. వాటి చివరల్ని తీసేయండి. అవి
గుండ్రంగా ఉండేలా కట్ చేయండి. ఇప్పుడు చిక్కబడిన పాలలో రబ్రీని వెయ్యండి. ఆ తర్వాత
గుండ్రంగా ఉన్న బ్రెడ్ ముక్కల్ని అందులో వెయ్యండి.
4. ఇప్పుడు ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక రుచికరమైన
బ్రెడ్ రసమలై సర్వ్ చెయ్యండి.