Advertisement

  • రుచికరమైన స్వీట్ పొంగల్ తయారీ విధానం

రుచికరమైన స్వీట్ పొంగల్ తయారీ విధానం

By: Sankar Sun, 23 Aug 2020 2:55 PM

రుచికరమైన స్వీట్ పొంగల్ తయారీ విధానం


వినాయకుడుకి అత్యంత ఇష్టమైన వాటిలో స్వీట్స్ ఒకటి..అలంటి స్వీట్ లలో రుచికరమైన స్వీట్ పొంగల్ ఒకటి..ఇప్పుడు స్వీట్ పొంగల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్దాలు:

నూక బియ్యం : ½ కప్పు (సోనా మసూర బియ్యం)

పెసరపప్పు: 3 టేబుల్ స్పూన్

బెల్లం: ¾ కప్పు (తురుముకోవాలి)

నీళ్ళు: 4 కప్స్

నెయ్యి: 3 టేబుల్ స్పూన్

ద్రాక్ష: 12-15

జీడిపప్పు: 8-10

యాలకలు: 2

లవంగాలు: 2

తినే కర్పూరం: చిటికెడు (అవసరం అయితేనే)

తయారీ విధానం :

1. ముందుగా బియ్యం శుభ్రం గా కడిగి పెట్టుకోవాలి.

2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో ఒక చెంచా తేనె వేసి, పెసరపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి పెట్టుకోవాలి.

3. ఇప్పుడు అందులో మూడు కప్పుల నీళ్ళు మరియు శుభ్రం చేసి పెట్టుకొన్న బియ్యం వేసి బాగా మిక్స్ చేయాలి.

4. ఈ మిశ్రమాన్ని ఒకటి రెండు విజిల్స్ వచ్చే వరకూ మెత్తగా ఉడికించుకోవాలి .

5. అంతలోపు, ఒక బౌల్లో ఒక కప్పు నీళ్ళు పోసి అందులో బెల్లం తురుము వేయాలి.

6. ఈ గిన్నె స్టౌ మీద పెట్టి, బెల్లం కరిగే వరకూ ఉడికించాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.

7. తర్వాత అందులోనే యాలకలు, లవంగాలు, మరియు తినెకర్పూరం చిటికెడు వేసి బాగా మిక్స్ చేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.

8. తర్వాత మిగిలిన నెయ్యిని పాన్ లో వేసి వేడిచేయాలి. తర్వాత అందులోనే ద్రాక్ష, జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి .

9. ఇలా ఫ్రై చేసిన వాటిని పొంగల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే వేడి వేడిగా స్వీట్ పొంగలిని సర్వ్ చేయాలి.





Tags :
|
|

Advertisement