రుచికరమైన ఎగ్ పరోటా తయారీ ...
By: Sankar Wed, 22 July 2020 6:47 PM
ఆలూ పరోటా, మేతి పరోటా చేసుకుని తింటాం... అలాగే ఎగ్ తో కూడా పరోటా చేసుకోవచ్చు ...వెజిటేరియన్ పరోటా తినలేక వెరైటీ చేయాలనీ అనుకున్న వారు ఎగ్ పరోటా ట్రై చేయవచ్చు ..
కావాల్సిన పదార్ధాలు :
కోడి గుడ్లు - నాలుగు, గోధుమపిండి - పావు కిలో, మిరియాల పొడి - టీ స్పూను, కొత్తిమీర తురుము - అరకప్పు, నూనె లేదా నెయ్యి - సరిపడినంత..
తయారీ విధానం :
1. ముందుగా కోడిగుడ్లను ఉడికించి పెట్టుకోవాలి.
2. కోడిగుడ్లను సన్నగా తురిమినట్టు కోసుకోవాలి.
3. ఆ తురుములోనే మిరియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి. దానిని పక్కన పెట్టేయాలి.
4. ఇప్పుడు ఓ బౌల్ లో నీళ్లు, గోధుమపిండి, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలపాలి. ఒక టీస్పూను నెయ్యి కూడా వేసి కలపాలి. పరోటా ముద్దను అరగంట సేపు నాననివ్వాలి.
5. అనంతరం పిండి ముద్దను ఉండల్లా చుట్టి చపాతీలా ఒత్తుకోవాలి. మధ్యలో గుడ్డు తురుము మిశ్రమాన్ని వేసి అంచులు మూసేయాలి. మళ్లీ చపాతీలా ఒత్తుకోవాలి.
6. ఇప్పుడు పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.దీనితో రుచికరమైన ఎగ్ పరోటా తయారు అయినట్లే ...