ఆరోగ్యమైన మరియు రుచికరమైన ఆపిల్ కేక్ తయారీ విధానం
By: Sankar Thu, 20 Aug 2020 6:20 PM
రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అని వైద్య నిపుణులు చెబుతారు ..అయితే పిల్లలకు రోజు యాపిల్ ఒకే విధంగా తినాలంటే అంతగా ఆసక్తి చూయించరు..అందుకే యాపిల్స్ తో కేక్ లాంటివి తయారు చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉంటుంది
కావాల్సిన పదార్దాలు :
యాపిల్స్ – 6,
గోధుమ పిండి - అర కప్పు,
మొక్కజొన్న పిండి - అర కప్పు,
మైదా పిండి - అర కప్పు,
బ్రౌన్ సుగర్ – అర కప్పు,
బటర్ – పావు కప్పు,
వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ – 1 టీ స్పూన్,
గుడ్లు – 3, పాలు – 1 కప్పు
ఆప్రికాట్ జామ్ – పావుకప్పు (మార్కెట్‌లో లభిస్తుంది)
తయారీ విధానం :
1. ముందుగా ఆపిల్స్ శుభ్రం చేసుకుని నాలిగింటిని మెత్తగా, గుజ్జులా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత బటర్ కరిగించుకుని ఒక పెద్ద బౌల్‌లో పోసుకుని అందులో బ్రౌన్ సుగర్, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు అందులో గుడ్లు, గోధుమపిండి, మొక్కజొన్న పిండి, మైదాపిండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, పాలను కొద్దికొద్దిగా వేస్తూ మొత్తం కలపాలి.
4. ఇప్పుడు ఆపిల్ గుజ్జు, ఆప్రికాట్ జామ్ కూడా వేసుకుని బాగా కలుపుకుని ఓవెన్‌లో పెట్టుకునేందుకు అవసరమైన పాత్రలో ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి.
5. ఇప్పుడు మిగిలిన రెండు ఆపిల్స్‌ని అర్థచంద్రాకారంలో ముక్కలు చేసుకుని, వాటిని పైన అలంకరించుకుని 35 నుంచి 40 నిమిషాల పాటు ఓవెన్‌లో ఉడికించుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు అభిరుచిని బట్టి కేక్‌పైన క్రీమ్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి డెకరేట్ చేసుకోవచ్చు.