Advertisement

రుచికరమైన పన్నీర్ 65 తయారీ విధానం ..

By: Sankar Sun, 05 July 2020 8:56 PM

రుచికరమైన పన్నీర్ 65  తయారీ విధానం ..



చికెన్ 65 అనగానే ఎందరో నాన్ వెజ్ ప్రియులకు నోటిలో లాలాజలం రావడం ఖాయం ..వాటి టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది ..అయితే మరి నాన్ వెజ్ తినని వాళ్లకు ఎలా అని ఆలోచిస్తున్నారా ..వాళ్ళ కోసమే పన్నీర్ తో పన్నీర్ 65 చేసుకోవచ్చు ..చికెన్ 65 లాగానే పన్నీర్ 65 కూడా టేస్ట్ ఎంతో రుచిగా ఉంటుంది ..ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూదాం ..

కావాల్సిన పదార్ధాలు :

పన్నీర్ ముక్కలు - పది, ఉల్లిపాయలు - పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు - అర టీస్పూను, కొత్తిమీర తరుగు - పావు కప్పు, మైదా - ఒక టీస్పూను, కార్న్ ఫ్లోర్ - ఒక టీ స్పూను, అల్లం పేస్టు - ఒక టీస్పూను, కారం - సరిపడినంత , పసుపు - అర టీ స్పూను, గరం మసాలా - టీస్పూను, నూనె - సరిపడినంత..

తయారీ విధానం:

స్టవ్ మీద కళాయి పెట్టి... వేయించడానికి సరిపడా నూనె పోయాలి. నూనె కాస్త వేడెక్కాక పన్నీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం పేస్టు వేసి వేపాలి.తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి. తరువాత కొంచెం నీరు పోయాలి. అవి ఉడుకుతుండగా... మరో బర్నర్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెలో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు బాగా వేగిన పన్నీర్ ముక్కల్ని తీసి వీటిలో వేసి బాగా కలపాలి. అంతే పన్నీర్ 65 సిద్ధం.



Tags :
|
|

Advertisement