క్రంచీ పీనట్ బటర్ కుకీస్ తయారీ విధానం
By: Sankar Sun, 13 Sept 2020 2:12 PM
కుకీస్ పిల్లలు అత్యంత ఇష్టంగా తినేవాటిల్లో ఒకటి..అయితే వాటిని ప్రతిసారి బయట నుంచి తెచ్చుకోవడం అంటే కష్టమే.. అందుకే ఇంట్లోనే సులువుగా పీనట్ బటర్ తో కుకీస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్దాలు:
కోడి గుడ్లు – 2 (పెద్దవి)
వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ – ఒక టీ స్పూను
ఉప్పు – పావు టీ స్పూను
బేకింగ్ సోడా – ఒక టీ స్పూను
వేడి నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు
మైదా పిండి – 2 కప్పులు
బటర్/నెయ్యి – కొద్దిగా
తయారీ విధానం :
1.ముందుగా అవెన్‌ను 375 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి
2.. ఒక పెద్ద పాత్రలో బ్రౌన్ సుగర్, పంచదార, పీనట్ బటర్, కోడి గుడ్లు వేసి బాగా గిలకొట్టాలి (ఎలక్ట్రిక్ మిక్సర్ ఉంటే, అందులో వేసి బాగా మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి)
3. వెనిలా ఎక్స్‌ట్రాక్ట్, ఉప్పు, బేకింగ్ సోడా, వేడి నీళ్లు జత చేసి మరోమారు గిలకొట్టాలి
4. మైదా పిండి జత చేసి అన్నీ కలిసేవర కు మరోమారు గిలకొట్టాలి
5. కుకీస్ షీట్ లేదా అల్యూమినియం ఫాయిల్ తీసుకుని, దాని మీద బటర్ పూయాలి
6. కుకీస్ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని ఫ్రిజ్‌లో సుమారు అర గంటసేపు ఫ్రీజ్ చేసి, బయటకు తీసి, చిన్న చిన్న బాల్స్‌లా చేతితో తయారుచేసి కుకీస్ షీట్ మీద ఉంచి, ప్రీ హీట్ చేసిన అవెన్‌లో ఉంచాలి
7. సుమారు పావు గంట తరవాత బయటకు తీసి, చల్లారాక వాటిని గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.