సండే స్పెషల్ చికెన్ వడలు తయారీ
By: Sankar Sun, 20 Sept 2020 5:39 PM
వడలు మినప్పప్పు, పెసరపప్పులతోనే కాదు చికెన్ తోనూ చేసుకోవచ్చు.సాయంత్రం వేళ చికెన్ వడలు తింటూ ఎంజాయ్ చేయండి.
కావాల్సిన పదార్థాలు
చికెన్ (బోన్‌లెస్) - అరకిలో, కొబ్బరి తురుము - అరకప్పు, ఉల్లి తరుగు - అర కప్పు, పచ్చి మిర్చి - నాలుగు, దాల్చిన చెక్క - చిన్న ముక్క, గోధుమ రవ్వ - చెంచా, లవంగాలు - రెండు, కరివేపాకు - రెండు రెబ్బలు, అల్లం తరుగు - ఒక చెంచా, నూనె - సరిపడినంత, ఉప్పు - తగినంత
తయారీ విధానం
1. చికెన్ శుభ్రంగా కడిగి తడి లేకుండా వార్చేయాలి.
2. పైన చెప్పిన పదార్థాలలో నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ (చికెన్ తో సహా) మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా చేయాలి.
3. మరీ గట్టిగా ఉంటే కాస్త నీరు చేర్చి మిక్సీ వేయాలి. ఆ రుబ్బుని గిన్నెలోకి తీసుకోవాలి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి బాగా వేడి చేయాలి. అందులో చికెన్ రుబ్బుని వడల్లా అద్ది నూనెలో వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే చికెన్ వడలు రెడీ అయినట్టే.