కాలీఫ్లవర్ ఫ్రై కర్రీ తయారీ విధానం
By: Sankar Tue, 15 Sept 2020 4:38 PM
గోబిపువ్వు అని పిలిచే కాలీఫ్లవర్‌ని తినేవారు చాలా అరుదు. ఇందులో చిన్నచిన్న పురుగులు ఉంటాయి.. వండేటప్పుడు వాసన వస్తుందని కాలీఫ్లవర్‌ని ఆహారంగా తీసుకునేందుకు చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అయితే కాలీ ఫ్లవర్ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.అయితే కాలీఫ్లవర్తో ఫ్రై చేసుకుంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది..ఇప్పుడు కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్దాలు:
క్యాలీఫ్లవర్ తరుగు – 3 కప్పులు; నీళ్లు – 3 కప్పులు; ఉప్పు – తగినంత; పేస్ట్ కోసం; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; సోంపు – పావు టీ స్పూను; కొబ్బరి నూనె లేదా నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 1; కరివేపాకు – రెండు రెమ్మలు; టొమాటో తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; గరం మసాలా పొడి – పావు టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం :
గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి, అందులో క్యాలీఫ్లవర్ తరుగు వేసి శుభ్రంగా కడగాలి
2. స్టౌ మీద బాణలిలో మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించి దింపేయాలి
3. క్యాలీఫ్లవర్‌ను అందులో వేసి సుమారు పది నిమిషాల తరవాత నీరంతా ఒంపేయాలి
4. స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా కొబ్బరి నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి
5. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
6. టొమాటో తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి
7. ముక్కలు బాగా మెత్తపడ్డాక, పసుపు, మిరపకారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేయించాలి
8. క్యాలీఫ్లవర్ తరుగు వేసి బాగా కలియబెట్టాలి (నీళ్లు పోయకూడదు) మూత పెట్టి సన్నని మంట మీద కొద్దిసేపు ఉంచి, దింపేయాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి)
9. కొత్తిమీరతో అలంకరించాలి
10. అన్నం, చపాతీ, పరాఠాలలోకి రుచిగా ఉంటుంది.