బెంగాలీ కిచిడి తయారీ విధానం
By: Sankar Fri, 11 Sept 2020 07:48 AM
కిచిడి ట్రెడిషినల్ ఇండియన్ డిష్. సాధారణంగా దీన్ని బియ్య, పప్పుతో తయారు చేస్తారు. ఇది తయారు చేయడం సులభం మాత్రేమే కాదు, ఇందులో న్యూట్రీషియన్స్ కూడా అధికమే. ఇది పెరుగు, రైతాతో సర్వ్ చేసేటటువంటి మెయిన్ డిష్.అయితే ఈ కిచిడి లో అనేక రకాలు ఉంటాయి..ఇందులో మనం బెంగాలి కిచిడి తయారీ విధానం తెలుసుకుందాము
కావాల్సిన పదార్ధాలు :
బాస్మతి బియ్యం – ఒక కప్పు
పొట్టు పెసర పప్పు – ఒక కప్పు
నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
ఏలకులు – 2, లవంగాలు – 3, బిర్యానీ ఆకు – 1
జీలకర్ర – ఒక టీ స్పూను, అల్లం తురుము – ఒక టీ స్పూను,
పసుపు – అర టీ స్పూను, మిరప కారం – అర టీ స్పూను, ఇంగువ – పావు టీ స్పూను
టొమాటో తరుగు – పావు కప్పు
తరిగిన పచ్చి మిర్చి – 4
ఉడికించిన బంగాళ దుంపలు – 2
క్యాలీఫ్లవర్ తరుగు – అర కప్పు
పచ్చి బఠాణీ – పావు కప్పు, క్యారట్ తరుగు – పావు కప్పు
పంచదార – అర టీ స్పూను, ఉప్పు – తగినంత, నీళ్లు – 5 కప్పులు.
తయారీ విధానం :
1.బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి
2.స్టౌ మీద పాన్‌లో పొట్టు పెసర పప్పును వేసి బంగారు రంగులోకి మారేవరకు ఆపకుండా కలుపుతూ వేయించి, దింపి చల్లారాక, తగినన్ని నీళ్లు జత చేసి బాగా కడిగి నీరు వడ కట్టేయాలి
3. స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి
4.దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి
5.అల్లం తురుము, పసుపు, మిరప కారం, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి
6.టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి టొమాటో ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి
7.బంగాళ దుంప తరుగు, క్యాలీఫ్లవర్ తరుగు, పచ్చి బఠాణీ జత చేసి బాగా మెత్తబడేవరకు కలుపుతుండాలి
8.వేయించిన పొట్టు పెసర పప్పు జత చేసి మరోమారు వేయించాలి
9. వడ కట్టిన బియ్యం జత చేయాలి ’ ఐదు కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి, ఉప్పు, పంచదార జత చేసి బాగా కలియబెట్టి, మూత పెట్టాలి ’ ఉడికిన తరవాత దింపేయాలి ’ పెరుగు, అప్పడాలతో వేడివేడిగా సర్వ్ చేయాలి.