Advertisement

  • హాట్ హాట్ అరటికాయ బజ్జిలు తయారీ విధానం

హాట్ హాట్ అరటికాయ బజ్జిలు తయారీ విధానం

By: Sankar Sun, 22 Nov 2020 11:15 AM

హాట్ హాట్ అరటికాయ బజ్జిలు తయారీ విధానం


చలి కాలం లో రోజంతా చల్లగా ఉండటం వలన ఎక్కువగా ఏదయినా హాట్ హాట్ గా తినాలనిపిస్తుంది..అయితే ఎప్పుడు తినేవె కాకుండా కొంచెం వెరైటీ గా అరటికాయ బజ్జిలు ట్రై చేయండి..అయితే ఇపుడు ఆ అరటికాయ బజ్జిలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం...

కావాల్సిన పదార్ధాలు :

అరటికాయ – 1; సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – అర టీ స్పూను; కసూరీ మేథీ – ఒక టీ స్పూను; వంట సోడా – చిటికెడు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; వేయించిన పల్లీలు – ఒక టేబుల్‌ స్పూను; సన్నటి ఉల్లి తరుగు – అర కప్పు; నిమ్మరసం – ఒక టేబుల్‌ స్పూను.

తయారీ విధానం :


1.అరటి కాయల తొక్కు తీసి, సన్నగా చక్రాల్లా తరిగి, ఉప్పు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి

2. ఒక గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, మిరపకారం, ఉప్పు, ధనియాల పొడి, కసూరీ మేథీ, వంట సోడా వేసి బాగా కలపాలి

3. తగినన్ని నీళ్లు జత చేస్తూ బజ్జీల పిండి మాదిరిగా కలపాలి

4. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, అరటి కాయ చక్రాలను ఒక్కోటి పిండిలో ముంచుతూ నూనెలో వేసి రెండువైపులా దోరగా వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి

5. చాకుతో బజ్జీలను ఒక వైపు సన్నగా కట్‌చేయాలి

6. మూడు పల్లీలు, ఉల్లి తరుగు స్టఫ్‌ చేసి, పైన నిమ్మరసం కొద్దిగా వేయాలి

7. వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.

Tags :
|
|
|

Advertisement