Advertisement

  • నాన్ వెజ్ ప్రియులకు నోరూరించే గోంగూర మటన్ తయారీ విధానం

నాన్ వెజ్ ప్రియులకు నోరూరించే గోంగూర మటన్ తయారీ విధానం

By: Sankar Fri, 16 Oct 2020 10:46 PM

నాన్ వెజ్ ప్రియులకు నోరూరించే గోంగూర మటన్ తయారీ విధానం


శాకాహారులకు అత్యంత నచ్చే వంటకాలలో ఒకటి గోంగూర అలాగే మాంసాహారులకు మటన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే శాకాహారం , మాంసాహారం అయినా ఈ రెండిటిని కలిపి గోంగూర మటన్ వండితే ఆ రుచి ఇక అమోఘం అనే చెప్పాలి ..అందుకే ఎప్పుడు రొటీన్ గా కాకుండా కొంచెం కొత్తగా మటన్ తినాలనుకునే వారికీ ఈ గోంగూర మటన్ బెస్ట్ ఛాయస్ ..ఇపుడు గోంగూర మటన్ ఎలా చేయాలో తెల్సుకుందాం

కావాల్సిన పదార్ధాలు

గోంగూర ఆకులు – 250 గ్రాములు; మేక మాంసం – 500 గ్రాములు; కొత్తిమీర – తగినంత; పుదీన – గుప్పెడు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లిపేస్ట్‌ – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్‌; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కారం – తగినంత; మసాలా – (లవంగాలు –4, యాలకులు –4, ధనియాలు టేబుల్‌ స్పూన్‌. ఇవన్నీ కలిపి వేయించి, పొడి చేయాలి); గసగసాలు – టీ స్పూన్‌

తయారీ విధానం :

1. మటన్‌ ముక్కలను వేడినీటిలో 10 నిమిషాలు ఉడికించాలి

2. పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె వేసి వేడిచేయాలి

3. అందులో సాజీరా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి

4. అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పుసుపు వేసి కలపాలి

5. అందులో మటన్‌ వేసి 5 నిమిషాలు ఉడికించాలి

6. తగినంత కారం, ఉప్పు కలిపి ఉడికించాలి

7. కొబ్బరి పొడి వేసి 15 నిమిషాలు ఉడికించాలి

8. తరువాత తరిగిన గోంగూర ఆకులు వేసి ఉడికించాలి

9. చివరగా గరం మసాలా, కొత్తి మీర వేసి దించాలి.

Tags :
|

Advertisement