Advertisement

ఎగ్ ఆమ్లెట్ తో హాట్ హాట్ కర్రీ

By: chandrasekar Sat, 25 July 2020 4:59 PM

ఎగ్ ఆమ్లెట్ తో హాట్ హాట్ కర్రీ


ఎగ్ తో ఎన్నో వంటకాలు తయారు చేయవచ్చు. ఎగ్ తో చేసిన అన్ని వంటకాలు రుచిగానే ఉంటాయి. ఆమ్లెట్ ముక్కలతో టేస్టీ కర్రీ తయారుచేసుకోవచ్చు. చేపల కర్రీలా ఇది కూడా భలే ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు

గుడ్లు - నాలుగు
కొత్తిమీర తురుముు - ఒక టీస్పూను
శెనగపిండి - రెండు టీస్పూనులు
గరం మసాలా - ఒక టీస్పూను
టొమాటో ప్యూరీ - రెండు కప్పులు
ఉల్లితరుగు - ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూనులు
కొబ్బరిపాలు - ఒక కప్పు
కారం - ఒక టీస్పూను
పసుపు - చిటికెడు
జీలకర్ర - ఒక టీస్పూను
నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా


నాలుగు గుడ్ల సొనను ఒక గిన్నెలో వేయాలి. అందులో కాస్త సెనగపిండి, కొత్తిమీర తురుము, కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పెనం మీద ఆ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసి మూతపెట్టాలి. అరఅంగుళం మందంలో ఆమ్లెట్ తయారవుతుంది. అది చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి స్టవ్ మీద పెట్టి కాస్త నూనె వేయాలి. అందులో జీలకర్ర, ఉల్లి ముద్ద వేసి వేయించాలి అది వేగాక టోమాటో గుజ్జు, అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. అవి బాగా వేగాక కొబ్బరి పాలు వేసి వేయించాలి. తరువాత కప్పు నీళ్లు వేయాలి. కాసేపు మరిగాక కారం, పసుపు, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి. ఆ మిశ్రమం బాగా మరిగాక ఆమ్లెట్ ముక్కలు వేసి ఉడికంచాలి. ముక్కలు వేశాక ఓ ఏడు నిమిషాల పాటూ మరిగించి స్టవ్ ఆపేయాలి. అంతే వేడివేడి కర్రీ రెడీ.

Tags :
|
|
|

Advertisement