ఆరోగ్యకరమైన, రుచికరమైన క్యాబేజీ బఠానీ కూర
By: chandrasekar Sat, 11 July 2020 6:41 PM
కావలసిన పదార్థాలు:
కాబేజీ: 250
గ్రాములు
కప్ బఠానీలు: 1 కప్
టమాటో ప్యూరీ: 2 కప్
కారప్పొడి: తగినంత
ధనియాల పొడి: 1 టీ
స్పూన్
జీలకర్ర: 1 టీ
స్పూన్
సాల్ట్: తగినంత
కొత్తిమీర: 1 చేతి
నిండా
పచ్చి మిర్చి: 1 టీ స్పూన్
అల్లం: 1 inch
రీఫైండ్ ఆయిల్: తగినంత
పసుపు: చిటికెడు
క్యాబేజీని సన్నగా కట్
చేసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని స్టౌపై పెట్టి వేడిచేయాలి.పాన్
వేడి అయిన తర్వాత నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో జీలకర్ర వేసి వేయించాలి.
ఆ తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లంతురుము వేసి వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు
బాగా వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసి 5
నిమషాల పాటు ఫ్రై చేయండి. క్యాబేజీ మెత్తగా ఉడికిన తర్వా అందులో బఠానిలు వేసి
కలపండి. ఆ తర్వాత సేంద్రియ ఉప్పు వేయండి. ఇప్పుడు మంటను తగ్గించి మూత పెట్టి 2
నిమిషాల పాటు సిమ్‌లో ఉడికించండి.
ఇప్పుడు అందులోనే టమోటా
ప్యూరీ వేసి పదార్థాలన్నింటికీ పట్టేలా చిన్న మంటపై 6
నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఆ తర్వాత మూత పెట్టి
మరో 5
నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూసి కూరగాయలు ఉడికకపోతే మంట కాస్తా
పెంచి 2
నిమిషాల పాటు ఉడికించండి. అంతే, ఇప్పుడు వేడి వేడి క్యాబేజీ బఠానీ కూర రెడీ అయినట్లే.
దానిని ఓ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.