Advertisement

రుచికరమైన 'కుట్టు కే పకోడా'

By: chandrasekar Sat, 01 Aug 2020 09:19 AM

రుచికరమైన 'కుట్టు కే పకోడా'


పండుగల సందర్భాల్లో ప్రత్యేక వంటలు చేసి తినడం ముఖ్యం. అలాంటి వంటకాల్లో ఒకటే "కుట్టు కే పకోడా" నవరాత్రి, దసరా వంటి పండుగల్లో నార్త్ ఇండియా లో ఎక్కువగా చేసుకునే ఈ రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతే పోషక విలువలను కూడా కలిగి ఉంటుంది. తృణధాన్యాల పిండితో ఈ వంటకం తయారు చేస్తారు.

కావలసిన పదార్థాలు:

ఉడకబెట్టిన బంగాళాదుంపలు: 2

బక్వీట్: 1 కప్

ఉప్పు: 1 టీ స్పూన్

కొత్తిమీర: 1 చేతి నిండా

మిరియాలు: 1 టీ స్పూన్

అవసరాన్ని బట్టి నీళ్ళు, ఆయిల్

తయారీ విధానం:


ఓ గిన్నె తీసుకుని అందులో పిండిని వేయండి. అందులోనే అల్లం తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, నల్లమిరియాల పొడి, ఉప్పు వేసి పదార్థాలన్నీ కలిసిపోయేలా బాగా కలపండి. ఇప్పుడు నీరు వేసుకుని బజ్జీల పిండిలా కలపండి. మరి జారుడుగా ఉండకూడదు. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలను పిండిలో ముంచుతూ వేడి నూనెలో వేయండి. పకోడాలకు ఒకదానికి ఒకటి అంటుకోకుండా చూడండి. మీడియం మంటపై మెల్లిగా వేయించండి. గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకూ వేయించండి. ఈ పకోడాలను చట్నీ, సాస్‌లతో తింటే సూపర్ గా ఉంటాయి.

Tags :
|

Advertisement