రుచికరమైన గుమ్మడి బీట్‌రూట్ వడ
By: chandrasekar Tue, 23 June 2020 7:03 PM
బార్లీలో విటమిన్- బి, పొటాషియం, సెలీనియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, యాంటీ
ఆక్సిడెంట్స్, ఫైబర్
పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడికాయకూ రోగ నిరోధకశక్తిని ఇచ్చే గుణం ఉంది. బీట్‌రూట్‌లో విటమిన్- ఎ, సి, కెలతో
పాటు బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు
పుష్కలం. దీంతో రక్తశుద్ధి జరుగుతుంది. బీట్‌రూట్ రక్తపోటును తగ్గించడంలో
సాయపడుతుంది. శరీరాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. శనగలకు మధుమేహాన్ని నియంత్రించే
గుణం ఉంది. పసుపు గురించి ప్రత్యేకంగా
చెప్పాల్సిన పన్లేదు.
కావలసిన పదార్థాలు:
* శనగలు
(8–10 గంటలు నానబెట్టాలి) – 1 కప్పు తీసికోవాలి
* తురిమిన
బీట్‌రూట్ – 1/2 కప్పు తీసికోవాలి
* తురిమిన
గుమ్మడికాయ – 1/2 కప్పు తీసికోవాలి
* బార్లీ
పిండి – 2
టేబుల్ స్పూన్లు
* పసుపుకొమ్ము – 1
* అల్లం – 1
* వెల్లుల్లి, లవంగాలు – 2-3
* కొన్ని
పుదీనా ఆకులు
* చిటికెడు
ఇంగువ
* వేయించిన
జీలకర్ర – 1/4
స్పూన్
* ధనియాలు
– 1
టీస్పూన్
* పచ్చిమిర్చి
– 1
* నిమ్మరసం
– 1
టేబుల్ స్పూన్
* తగినంత
ఉప్పు
* వేయించేందుకు
నూనె
తయారీ విధానం:
నానబెట్టిన శనగలు, పసుపు, అల్లం, వెల్లుల్లి, పుదీనా
ఆకులు, ఇంగువ, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు
అన్నీ కలిపి మెత్తగా దంచుకోవాలి. ఆ
మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో తురిమిన గుమ్మడికాయ, బార్లీ పిండి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అవసరం మేరకు నీళ్లు
పోయాలి. పదిహేను నిమిషాల పాటు
మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. ఒక కడాయిలో వడలు మునిగేంతలా నూనెపోసి వేడి
చేసుకోవాలి. పక్కనపెట్టుకున్న మిశ్రమంతో వడలు వేసుకుని. వేడివేడిగా తింటే రుచికి
రుచి, పోషకాలకు పోషకాలు.