Advertisement

మునగాకుతో కమ్మని పచ్చడి

By: chandrasekar Tue, 15 Sept 2020 12:40 PM

మునగాకుతో కమ్మని పచ్చడి


కావాల్సిన పదార్థాలు:

క్యాప్సికం: 2
టమాటాలు: 2
మునగాకు: అర కప్పు
పచ్చిమిర్చి: ఐదారు
చింతపండు: కొద్దిగా
బెల్లం: అర టీస్పూను
మినప్పప్పు: టీ స్పూను
కొబ్బరి: చిన్న ముక్క
ఎండుమిర్చి: 4
ఆవాలు: అర టీస్పూను
మెంతులు: పావు టీ స్పూను
ఇంగువ: చిటికెడు
నూనె: పావు కప్పు
ఉప్పు: తగినంత

తయారీవిధానం:

ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేడి చేసి మినప్పప్పు, ఆవాలు, మెంతులు వేయించి తరువాత ఎండుమిర్చి, ఇంగువ వేయాలి. 2 నిమిషాల తరువాత ఈ తాలింపుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

అదే పాత్రలో కొద్దిగా నూనె వేడి చేసి క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, మునగాకు, చింతపండు, బెల్లం వేసి మగ్గించాలి.

మునగాకులోని పచ్చివాసన పోయే వరకు ఉంచి తరువాత దింపేయాలి. మునగాకు మిశ్రమాన్ని రోట్లోకి తీసుకొని, కొబ్బరి, పక్కన పెట్టుకున్న తాలింపు, తగినంత ఉప్పు వేసి మెత్తగా నూరుకుంటే సరిపోతుంది. కమ్మని పచ్చడి తరైపోయింది.

Tags :

Advertisement