కరోనా చికిత్సకు టాబ్లెట్ విడుదల చేసిన మరొక కంపెనీ ..
By: Sankar Thu, 06 Aug 2020 08:40 AM
కరోనా చికిత్సలో కీలకపాత్ర పోషిస్తున్న ఫావిపిరవిర్‌ను హైదరాబాద్‌కు చెందిన మరో సంస్థ ఉత్పత్తి చేయనున్నది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ ‘జెనరా’.. ఫావిజెన్ పేరుతో వీటిని విడుదల చేయనున్నది.
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు వచ్చాయని సంస్థ వెల్లడించింది. ప్రాథమిక, మధ్యస్థ కరోనా లక్షణాలు ఉన్నవారికి ఈ ట్యాబ్లెట్లను వాడొచ్చని పేర్కొన్నది. ఈ ఔషధం తయారీకి దిగుమతులపై ఆధారపడటం లేదని, తక్కువ వ్యవధిలోనే అవసరమైన మోతాదులో ఔషధాలను ఉత్పత్తి చేస్తామని తెలిపింది.
లాటిన్ అమెరికా, మధ్య ఆసియా దేశాలకు సైతం ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొన్నది. ప్రస్తుతానికి ధర వెల్లడించలేదు. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.100 వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.
Tags :
zenara |
pharma |
receives |
nod |
sell |
corona |