ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు
By: Sankar Fri, 04 Sept 2020 12:43 PM
ఇద్దరికి ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి చేసుకునేందుకు యువకుడు ఇష్టపడ లేదు. అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతన్ని ప్రేమించిన యువతిలో కోపం రగిలిపోయింది. వారం రోజుల వ్యవధిలోనే యువకుడిపై యాసిడ్‌తో రెండుసార్లు దాడి చేసింది.
ఈ ఘటన కర్నూల్ జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకోలేదనే కోపంతోనే నాగేంద్ర అనే యువకుడిపై ఆ యువతి యాసిడ్ దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవలే నాగేంద్ర మరో యువతిని వివాహమాడాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరి కులాలు వేరని, ప్రేమ పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని నాగేంద్ర ఆమెతో ప్రేమకు బ్రేకప్ చెప్పాడు. ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రియుడి వివాహాన్ని జీర్ణించుకోలేకపోయింది సుప్రియ. అతడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. యాసిడ్ దాడిలో నాగేంద్ర ముఖం, చెయ్యి బాగా కాలిపోవటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.