కొత్త కరోనా వైరస్ పై హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
By: Sankar Sun, 27 Dec 2020 09:51 AM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గింది అని భావిస్తున్న తరుణంలో యూకే ఒక్కసారిగా కొత్త వైరస్ స్ట్రెయిన్ విజృంభించడం మొదలుపెట్టింది..దీనితో ప్రపంచ దేశాలు అన్ని అప్రమత్తం అయ్యాయి...యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి..గత కొన్ని రోజులుగా యూకే నుంచి వచ్చిన వారిమీద నిఘా పెట్టాయి..
అయితే, తాజాగా కరోనా కొత్త స్ట్రెయిన్‌పై హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. ఈ కొత్త స్ట్రెయిన్‌తో యువతకు, పిల్లలకూ ప్రమాదకరమేనని హెచ్చరిస్తోంది డబ్ల్యూహెచ్‌వో.. కొత్త స్ట్రెయిన్.. ఏస్2 గ్రాహకాలను ఛేదించి చొచ్చుకెళ్తోంది.. దీంతో పిల్లలకు సులభంగా సోకే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది.. యూకేలో నమోదవుతున్న కేసుల్లో 15 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్య భారీగా ఉండడమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు..
అయితే, కొత్త స్ట్రెయిన్.. పిల్లలపై ప్రత్యేకంగా దాడి చేస్తుందని మాత్రం స్పష్టంగా చెప్పలేం అంటున్నారు బ్రిటన్ ఆరోగ్య నిపుణురాలు వెండీ బార్ల్కే.. కాగా, బ్రిటన్‌లో పురుడుపోసుకున్న కరోనా కొత్త స్ట్రెయిన్.. యూరప్‌లోని మరిన్ని దేశాలకు వ్యాపించింది. ఇప్పటికి 8 దేశాలకు పాకగా.. తాజాగా స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోనూ ఇలాంటి కేసులే నాలుగు నమోదు కావడం కలవరపెడుతోంది..