మహిళల ప్రపంచకప్ 2022 షెడ్యూల్ విడుదల
By: Sankar Tue, 15 Dec 2020 9:38 PM
మహిళల క్రికెట్ ప్రపంచ కప్-2022 షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. న్యూజిలాండ్ వేదికగా 2022 మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 మధ్య జరగనుంది.
31 రోజుల పాటు 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూజిలాండ్‌లోని ఆరు నగరాలు ఆక్లాండ్, టౌరంగా, హామిల్టన్, వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్, డునెడిన్ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తాయి. కివీస్, క్వాలిఫయర్ టీమ్‌ల మధ్య మార్చి 4న టౌరంగా వేదికగా ఆరంభ మ్యాచ్ జరగనుంది. ఇదే వేదికలో భారత్, ఇంగ్లాండ్ జట్లు తమ మొదటి మ్యాచ్‌లో తలపడనున్నాయి.
అయితే మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీకి ఇప్పటివరకు ''భారత్, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా'' 5 జట్లు మాత్రమే అర్హత సాధించాయి. ఇక మిగిలిన మూడు స్థానాలకు పోటీ పడుతున్న 10 జట్లు శ్రీలంక వేదికగా జరగనున్న ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఆడవలసి ఉంది. మరి ఈ మ్యాచ్ లు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది అనేది ఐసీసీ ఇంకా ప్రకటించలేదు