మరోసారి మమత సర్కారుపై ఫైర్ అయిన వెస్ట్ బెంగాల్ గవర్నర్
By: Sankar Sun, 06 Dec 2020 7:13 PM
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చట్టం నియమాలకు దూరమని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్ విమర్శించారు. ఆదివారం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన మమత సర్కార్‌పై మండిపడ్డారు.
‘పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చట్ట నియమాలకు దూరంగా ఉంటున్నది. రాజ్యాంగం బాటను వీడుతున్నది. బీఆర్ అంబేద్కర్ ఆత్మకు బాధ కలిగిస్తున్నది. ఇది నన్ను తీవ్రంగా కలిచివేస్తున్నది. ఆందోళన, బాధకు గురి చేస్తున్నది’ అని వ్యాఖ్యానించారు.
‘రాజ్యాంగానికి అనుగుణంగా పాలన చేయడానికి మమతా ప్రభుత్వానికి సమయం మించిపోయింది. అధికార యంత్రాంగం, పోలీసులు రాజకీయంగా తటస్థంగా ఉండాలి’ అంటూ ధంఖర్ ఆదివారం పలు ట్వీట్లు చేశారు
Tags :
governor |
fires |