భారత్ లో ఇక అధికారికంగా 'వుయ్ చాట్' సేవలు బంద్ ..
By: Sankar Mon, 27 July 2020 8:25 PM
భారత్‌లో నిషేధానికి గురైన చైనా మెసేజింగ్ యాప్ వుయ్ చాట్ ఇక్కడ వినియోగదారులకు తన సేవలను అధికారికంగా నిలిపివేసింది. చాలామంది వినియోగదారులు ఈ యాప్ నుంచి ఆటోమేటిక్‌గా లాగ్‌అవుట్ అయ్యారు. ఈ సమస్యను వారు ట్విట్టర్‌లో పెట్టారు.
ఈ మేరకు వుయ్ చాట్ కూడా తన వినియోగదారులకు ఒక నోటిఫికేషన్ పంపింది. ‘భారతీయ చట్టానికి అనుగుణంగా మేం ఈ సమయంలో మీకు సేవలను అందించలేకపోతున్నాం. మా ప్రతి వినియోగదారుడికీ విలువనిస్తాం. డేటా భద్రత, ప్రైవసీ మాకు చాలా ముఖ్యమైనవి. సంబంధిత అధికారులతో టచ్‌లో ఉన్నాం. భవిష్యత్తులో సేవలను తిరిగి ప్రారంభించగలమని ఆశిస్తున్నాం.’ అని పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఇండియాలో వుయ్ చాట్ సేవలను నిలిపివేయడం ఇక్కడ నివసిస్తున్న చైనా పౌరులను ప్రభావితం చేయనుంది. టిక్‌టాక్, ఇతర యాప్‌ల నిషేధం వల్ల తమకు ఇబ్బంది కలుగలేదు కానీ, వుయ్ చాట్ నిషేధంతో తమ సామాజిక, వృత్తిపరమైన సమాచార మార్పిడికి ఆటంకం కలుగుతున్నదని ఓ చైనీయుడు తెలిపాడు.