మొట్టమొదటిగా ఆండ్రాయిడ్ వెర్షన్ 11తో వివో వీ20
By: chandrasekar Sat, 03 Oct 2020 3:58 PM
ఇప్పుడు దేశంలో రోజుకో
స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తున్నారు. కానీ మొట్టమొదటిగా ఆండ్రాయిడ్ వెర్షన్ 11తో
వివో వీ20
విడుదల కానుంది. వివో వీ20 మనదేశంలో అక్టోబర్ 12వ తేదీన లాంచ్ కానుంది.
మనదేశంలో ఆండ్రాయిడ్ 11తో లాంచ్ కానున్న మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం విశేషం.
ఇది లాంచ్ అయిన రెండు రోజుల వ్యవధిలోనే వన్ ప్లస్ 8టీ లాంచ్ కానుంది. ఆ ఫోన్
కూడా ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతోనే రానుంది. అయితే వివో వీ20
స్టాక్ ఆండ్రాయిడ్‌తో కాకుండా ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్‌పై పనిచేస్తుంది. వివోకు
సంబంధించిన అప్ డేట్స్ మనదేశంలో కాస్త స్లోగా ఉంటాయని ఎప్పట్నుంచో కంప్లయింట్
ఉంది.
ఎప్పటిలా కాకుండా ఈసారి
మాత్రం వివో గూగుల్ కంటే వేగంగా ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంను మనదేశంలో లాంచ్ చేస్తోంది. ఇక
ప్రస్తుతానికి వివోకు ఉన్న పోటీ విషయానికి వస్తే వన్ ప్లస్ 8టీ
కూడా వివో వీ20 వచ్చిన రెండు రోజుల వ్యవధిలోనే ఆండ్రాయిడ్ 11
ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ కానుంది. రియల్ మీ, ఒప్పో, శాంసంగ్, షియోమీలు కూడా ఆండ్రాయడ్ 11తో
పనిచేసే బీటా స్కిన్‌లను ప్రకటించాయి కానీ అవి ఇంకా బీటా దశలోనే ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 11 స్టేబుల్ వెర్షన్‌తో లాంచ్ కానున్న మొదటి ఫోన్ ఇదే
కావడం విశేషం. రియల్ మీ, నోకియా, ఇతర కంపెనీలు ఇప్పటికే ఆండ్రాయిడ్ 11కు
సంబంధించిన రోడ్ మ్యాప్‌ను విడుదల చేశాయి.
వివో వీ20
స్పెసిఫికేషన్లు:
* ఈ ఫోన్ సన్ సెట్ మెలోడీ, మిడ్
నైట్ జాజ్, మూన్ లైట్ సొనాటా రంగుల్లో అందుబాటులో ఉండనుంది.
* వివో వీ20లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను
అందించనున్నారు.
* 2.2 గిగాహెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ
ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
* 8 జీబీ ర్యామ్,
128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు.
* ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో
ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా
పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా
ఉండనున్నాయి.
* ముందువైపు సెల్ఫీల కోసం 44 మెగా
పిక్సెల్ కెమెరాను అందించనున్నారు.
* దీని బ్యాటరీ సామర్థ్యం 4000
ఎంఏహెచ్‌గా ఉండనుంది. 33W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
* ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో
అందించారు. 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ/డ్యూయల్ 4జీ
వోల్టే, వైఫై, బ్లూటూత్
వీ5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం
హెడ్ ఫోన్ జాక్, యూఎస్ బీ టైప్-సీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
* ఈ ఫోన్ కేవలం 0.74 సెంటీమీటర్ల మందం, 171 గ్రాముల బరువు మాత్రమే
ఉన్నాయి.