బిగ్ బాస్ లో తన మద్దతు ఎవరికో ప్రకటించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ
By: Sankar Mon, 14 Dec 2020 2:29 PM
బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకుంది...చివరి వారంలోకి ఎంటర్ అయిన బిగ్ బాస్ లో చివరిగా అభిజిత్ , అఖిల్ , అరియనా , సోహెల్ , హారిక మిగిలారు...అయితే ఈ ఐదుగురిలో విన్నర్ అయ్యేది ఎవరో తెలియాలి అంటే ఈ ఆదివారం దాకా ఆగాల్సిందే...అయితే ఈ ఐదుగురిలో అభిజిత్ విన్నర్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ..బయట మద్దతు కూడా అభికే ఎక్కువగా ఉంది ...
ఇప్పటికే అభిజిత్‌కి నాగబాబు వంటి వారు మద్దతివ్వగా తాజాగా ఈ జాబితాలోకి ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ చేరారు. అభిజిత్‌కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ తన సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేశారు.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టీంతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ‘‘మై బాయ్స్.. ఎల్లప్పుడూ వారికి శుభాకాంక్షలు.. ఎక్కడైనా.. ఏదైనా’’ అంటూ పోస్ట్ చేశారు.
ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రం ద్వారా అభిజిత్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో విజయ్ దేవరకొండ గోల్డ్ ఫేజ్ కుర్రాడి పాత్రలో మెప్పించారు..