ముగిసిన జవాన్ పరశురాం అంత్యక్రియలు..
By: Sankar Sun, 27 Dec 2020 5:35 PM
వీరజవాన్ పరశురాం అంత్యక్రియలు స్వగ్రామం గుండీడ్ మండలం గువ్వనికుంట తాండలో ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. సైనిక లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంతోపాటు ఆర్మీజవాన్లు, పలువురు ప్రముఖులు పరశురాం పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అంతిమయాత్రలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ట్రాక్టర్ నడిపారు. అంజలి ఘటించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. గ్రామంలో ఎక్కడ చూసినా ఉద్వీగ్న వాతావరణం నెలకొంది.
జమ్ముకశ్మీర్‌లోని లేహ్‌లో ఆర్మీలో హవల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పరశురాం కొండచరియలు విరిగిపడటంతో గురువారం మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని శనివారం రాత్రి స్వగ్రామానికి చేర్చారు. పరశురాం కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. రూ. 25 లక్షలు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు తెలిపింది.