Advertisement

  • వారం రోజుల వ్యవధిలో రెండోసారి స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

వారం రోజుల వ్యవధిలో రెండోసారి స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

By: Sankar Wed, 02 Sept 2020 2:35 PM

వారం రోజుల వ్యవధిలో రెండోసారి స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి


దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది. కేసుల సంఖ్య ఇప్పటికే 37 లక్షలు దాటిపోయింది. ఎటునుంచి కరోనా కాటు వేస్తుందో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు.

గోవా ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయన హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఉత్తరాఖండ్ సీఎం పేషీలో పనిచేస్తున్న ఓఎస్డికి కరోనా సోకింది. దీంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ముఖ్యమంత్రి స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతో ఈరోజు జరగాల్సిన కేబినెట్ మీటింగ్ వాయిదా పడింది. ఆగష్టు 25 న మూడు రోజులపాటు సీఎం స్వీయ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. తరువాత మరలా ఇప్పుడు మరో అధికారికి కరోనా సోకడంతో సీఎం స్వీయనిర్బంధంలోకి వెళ్లారు.

కాగా దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి..కరోనా కు ఎవ్వరు అతీతులు కాదు అనే రీతిలో కరోనా మహమ్మారి అందరిపైన తన ప్రతాపాన్ని చూయిస్తుంది..ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల్లో మూడో స్థానంలో భారత్ , ఒక్క రోజు కరోనా కేసుల్లో మాత్రం మొదటి స్థానంలో ఉంది..

Tags :
|
|
|

Advertisement