యూపీఎస్సీ 2020 ప్రిలిమినరీ ఫలితాలు విడుదల
By: chandrasekar Sat, 24 Oct 2020 09:36 AM
యూపీఎస్సీ 2020
ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల చేయబడ్డాయి. దేశంలో అత్యున్నత సర్వీసు
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2020 ఫలితాలతో పాటు యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్
ప్రిలిమ్స్ 2020 ఫలితాలు శుక్రవారం, అక్టోబర్ 23 న
విడుదలయ్యాయి. విద్యార్థులు upsc.gov.in.
వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తమ ఫలితాలను
తెలుసుకోవచ్చును. ఫలితాలు చెక్ చేసుకోవడానికి యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in సందర్శించండి. తరువాత హోమ్ పేజీలో కనిపించే 'UPSC Civil Services Prelims 2020 results' ఆప్షన్‌ని క్లిక్ చేయండి.
క్లిక్ తీసిన తరువాత
పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ప్రిలిమ్స్ ఫలితాల్లో
అర్హత సాధించినవారి రోల్ నంబర్స్ మాత్రమే అందులో ఉంటాయి. ఫలితాలు క్రోనోలాజికల్
ఆర్డర్‌లో కనిపిస్తాయి. మీ రూల్ నంబర్ కోసం స్కాన్ చేయండి లేదా ఫైండ్ ఆప్షన్
ద్వారా ఫలితాలను చెక్ చేసుకోండి. ఈ ఏడాది దాదాపు 10.58లక్షల మంది ప్రిలిమ్స్
పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్‌కు అర్హత సాధించినవారు మెయిన్స్
పరీక్షలు రాసేందుకు అర్హులు.