రాణి అనే ఏనుగును దత్తత తీసుకున్న ఉపాసన
By: chandrasekar Tue, 21 July 2020 4:59 PM
ఉపాసన తనకంటూ సొంతంగా ఓ
గుర్తింపు సంపాదించుకోడానికి ఎప్పటికప్పుడు తన ప్రత్యేకత చూపిస్తూనే ఉంటుంది.
ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈమె. జులై 20న ఈమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె మంచి పని
చేసింది.
ఉపాసన అపోలో వైస్ ఛైర్మన్‌గా
ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. దాంతో పాటు పుట్టిన రోజు సందర్భంగా
ఆర్థిక సాయం కూడా చేసింది ఉపాసన. అంతేకాదు కొన్ని గ్రామాలకు ఉచితంగా మందుల పంపిణి
కూడా చేస్తున్నారు ఈమె.
ఇప్పుడు నెహ్రూ
జువాలజికల్ పార్క్‌లో ఓ ఏనుగును దత్తత తీసుకుని దాని పాలనకు అయ్యే ఖర్చును
ఇచ్చింది ఉపాసన. ఏడాది పాటు ఆ ఏనుగుకు కావాల్సిన ఖర్చుల నిమిత్తం పార్క్
నిర్వాహకులకు 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చింది ఉపాసన. రాణి అనే పేరున్న
ఏనుగును దత్తత తీసుకుంది ఉపాసన.
తనకు మూగ జీవాలంటే
యిష్టమని వాటికి కావాల్సిన ఆలన పాలన చూసుకోవడం సంతృప్తినిస్తుందని తెలిపింది
ఉపాసన. మరోవైపు సోషల్ మీడియాలో ఉపాసనకు బర్త్ డే విషెస్ చెప్తూ వేలాది మంది
అభిమానులు పోస్టులు చేసారు.