Advertisement

  • కేంద్ర మంత్రులను వదలని కరోనా ..తాజాగా మరొక కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

కేంద్ర మంత్రులను వదలని కరోనా ..తాజాగా మరొక కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

By: Sankar Thu, 27 Aug 2020 5:26 PM

కేంద్ర మంత్రులను వదలని కరోనా ..తాజాగా మరొక కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్


కరోనా మహమ్మారి రాజకీయ నాయకులను వదిలేలా లేదు ..ముఖ్యంగా కేంద్ర మంత్రులు ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకోగా , మరొక కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..

ఇప్పుడు తాజాగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని క్రిషన్ పాల్ స్వయంగా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగిన వారు, తనతో కాంటాక్టులో ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, కరోనా నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్ లో ఉండాలని ఆయన కోరారు.

ప్రజలు కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇక మరోవైపు దేశంలో కరోనా రోజురోజుకు అధికమవుతూనే ఉంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు, ఒక్కరోజులోనే దేశంలో 75,760 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య 33 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 1,023 మంది కరోనాతో చనిపోయారు. దీంతో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 60వేలు దాటింది. 25,23,772 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.


Tags :
|

Advertisement