కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా నెగటివ్
By: Sankar Fri, 14 Aug 2020 6:14 PM
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోవిడ్-19 నెగెటివ్‌గా తేలింది. కరోనా భారిన పడ్డ రెండు వారాల అనంతరం అమిత్ షాకు తాజాగా నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్నిఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ట్విట్టర్ ద్వారా అమిత్ షా స్పందిస్తూ... నేడు జరిపిన కరోనా పరీక్షలో ఫలితం నెగెటివ్‌గా వచ్చిందన్నారు. దేవుడికి ధన్యవాదాలన్నారు. తన ఆరోగ్యం పట్ల ప్రార్థించిన ప్రతీఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. డాక్టర్ల సలహా మేరకు మరికొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు తెలిపారు.
కరోనాపై పోరాటంలో తనకు చికిత్స అందించిన మేదాంత ఆస్పత్రి వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి కృతజ్ఞతలు అన్నారు. ఆగస్టు 2వ తేదీన అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. తనకు కరోనా సోకినట్లు వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. తనతో పాటు ఉన్న సిబ్బంది, సహచరులు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.