Advertisement

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన అమిత్ షా

By: Sankar Sun, 13 Sept 2020 09:11 AM

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన అమిత్ షా


కేంద్ర మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో శనివారం రాత్రి సుమారు 11 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో టవర్‌లో అడ్మిట్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా అమిత్ షా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.

దీనికి ముందు కూడా షా పోస్ట్- కోవిడ్ ట్రీట్‌మెంట్ కోసం ఎయిమ్స్‌లో చేరారు. ఆగస్టు 31న డిశ్చార్జ్ అయ్యారు. కాగా అమిత్ షా ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌గా తేలడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆగస్టు 14న అమిత్‌షాకు కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది.

తిరిగి 4 రోజుల్లో ఆగస్టు 18న పోస్ట్- కోవిడ్ కేర్ కోసం తిరిగి ఎయిమ్స్‌లో చేరారు. ఈ సందర్భంగా అమిత్‌ షా ఆసుపత్రి నుంచే తన మంత్రిత్వశాఖ పనులను నిర్వహించారు.

Tags :
|

Advertisement