Advertisement

  • చెరువులో ప్రమాదవశాత్తు జారీ పడి ఇద్దరు యువతులు మృతి..

చెరువులో ప్రమాదవశాత్తు జారీ పడి ఇద్దరు యువతులు మృతి..

By: Sankar Thu, 27 Aug 2020 1:31 PM

చెరువులో ప్రమాదవశాత్తు జారీ పడి ఇద్దరు యువతులు మృతి..


బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ఇద్దరు యువతులు మృతి చెందారు. ఈ ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐలాపూర్ తండా సమీపంలో చోటు చేసుకుంది.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలపూర్ చిన్న తండాలో కూలీలుగా నివాసముంటున్న నలుగురు యువతులు బట్టలుతకడానికి వెళ్లారు. ఉతకడం పూర్తి అయ్యాక చెరువులో స్నానం చేసే ప్రయత్నంలో ప్రమాద వశాత్తు చెరువులో జారిపడి ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని రక్షించాలని ప్రయత్నించి చెరువులో పడిపోయిన మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు.

మృతులు మహబూబ్ నగర్‌కు చెందిన వలస కూలీలు చిట్టి(20) అలియాస్ అశ్విని, వరలక్ష్మి (19)గా గుర్తించారు. వీరితో వెళ్లిన మరో ఇద్దరు శిల్ప, జ్యోతిల అరుపులు విని చెరువు పక్కన ఉన్న పరిశ్రమల్లో పనిచేసి కార్మికులు వచ్చి రక్షించారు. విషయం తెలుసుకున్న అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరి మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరువు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Tags :
|
|
|
|

Advertisement