Advertisement

  • కరోనా సెంటర్ నుంచి తప్పించుకున్న పాజిటివ్ వచ్చిన ఇద్దరు ఖైదీలు

కరోనా సెంటర్ నుంచి తప్పించుకున్న పాజిటివ్ వచ్చిన ఇద్దరు ఖైదీలు

By: Sankar Sat, 25 July 2020 2:01 PM

కరోనా సెంటర్ నుంచి తప్పించుకున్న పాజిటివ్ వచ్చిన ఇద్దరు ఖైదీలు



కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తులు పారిపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం చూస్తూనే ఉన్నాం ..పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇలా జనాల్లో కలిసి తిరగడం వలన ఇతరులకు కుడా కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందువలన అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ..తాజాగా ఏపీలోని ఏలూరు లో ఇలాంటి సంఘటనే జరిగింది ..

కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లుగప్పి పరారైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వెలుగుచూసింది. ఏలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న 13 మంది ఖైదీలకు ఇటీవల కరోనా వైరస్ సోకింది. దీంతో వీరిని సీఆర్ఆర్ కోవిడ్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన ఇద్దరు ఖైదీలు శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో అక్కడి నుంచి పరారయ్యారు.

దీంతో షాకైన కోవిడ్ సెంటర్ సిబ్బంది వెంటనే ఏలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఖైదీలు ఎలా తప్పించుకున్నారో విశ్లేషించారు. పరారైన ఇద్దరూ అనేక చోరీల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఈ ఘటనతో కోవిడ్ సెంటర్‌ వద్ద పోలీసులు బందోబస్తు పెంచారు. మిగిలిన ఖైదీలు పరారు కాకుండా కట్టుదిటమైన చర్యలు తీసుకున్నారు

Tags :
|
|
|

Advertisement