గాల్లో రెండు విమానాలు డీ ..ఎనిమిది మంది మృతి
By: Sankar Mon, 06 July 2020 2:41 PM
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రెండు విమానాలు పరస్పరం గాలిలోనే ఢీ కొనడంతో 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి మృతదేహాల్ని వెలికి తీశారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది.
గాలిలో ఢీ కొొన్న తరువాత రెండు విమానాలు కోయర్ డీ అలెన్ సరస్సులో కూలిపోయినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.మృతుల్లో పిల్లలు, పెద్దవాళ్లు కూడా ఉన్నారని సమాచారం. అయితే ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. సరస్సులో మునిగిపోయిన విమాన శకలాల్ని సోనార్ సహాయంతో గుర్తించారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. వాటిని బయటకు తీయడానికి ఒకటి నుంచి రెండు రోజుల సమయం పడుతుందన్నారు
Tags :
two |
planes |
collide |
crash |
into |
lake |