Advertisement

  • మైనర్ బాలికలను గర్భవతులను చేసిన అన్నాదమ్ములు

మైనర్ బాలికలను గర్భవతులను చేసిన అన్నాదమ్ములు

By: chandrasekar Wed, 30 Sept 2020 5:40 PM

మైనర్ బాలికలను గర్భవతులను చేసిన అన్నాదమ్ములు


పశ్చిమ గోదావరి జిల్లా తిరుమలం పాలెం పరిధిలోని ఓ శివారు గ్రామంలో ఇద్దరు మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వంచించి గర్భవతులను చేశారు అన్నాదమ్ములు. ఇద్దరు యువకులపై గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు దీంతో కుల పెద్దలు అనూహ్యంగా ఆ మైనర్ బాలికలతోనే వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఓ జంటకు అప్పటికే పెళ్లి చేసి, మరో జంటకు పెళ్లి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలంపాలెంకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు (16, 17 ఏళ్లు) అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములైన ఇద్దరు యువకులపై గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అన్నాదమ్ముళ్లు అయిన వీరు తమను ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతులను చేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని గ్రామ పెద్దలను ఆశ్రయించారు.

ఈ వ్యవహారంపై ఆదివారం రాత్రి స్థానిక కాలనీలోని రామాలయం వద్ద పంచాయతీ పెట్టారు. బాలికలకు అన్యాయం జరిగిందని తీర్పు ఇచ్చిన పెద్దలు.. వారితోనే అన్నదమ్ములకు వివాహం చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అన్నాదమ్ముల్లో చిన్నవాడైన 17 ఏళ్ల యువకుడికి 7 నెలల గర్భంతో ఉన్న బాలికతో వివాహం జరిపించారు.

సోమవారం ఉదయం అన్నకు, 8 నెలల గర్భంతో ఉన్న మరో బాలికకు వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వివాహాలపై కొందరు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయగా, వెంటనే పోలీసులు గ్రామానికి వెళ్లి.. రామాలయం వద్ద జరుగుతున్న వివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామ పెద్దలతో పాటు అన్నదమ్ములు, మైనర్ బాలికలను కౌన్సెలింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags :
|

Advertisement