టీవీ నటి దివ్య భట్నాగర్ కరోనాతో మృతి...
By: chandrasekar Mon, 07 Dec 2020 2:38 PM
దివ్య భట్నాగర్.. యే
రిష్టా క్యా కెహ్లతా హై, తేరా యార్ హూన్ మెయిన్ షోలలో నటించి పాపులర్ అయిన నటి
కరోనాతో పోరాడి మృతి చెందింది. దివ్య భట్నాగర్ మృతిపట్ల నటులు దేవోలీనా
భట్టాచార్జీ, శిల్పా శిరోద్కర్ సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని
వ్యక్తం చేసారు. కరోనాతో పోరాడుతున్న దివ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో పాటు
ఆమె శరీరంలో ఆక్సిజన్ స్థాయి గణనీయంగా పడిపోయిది. దీంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై
కూడా ఉంచారు. ఇక దివ్య భట్నాగర్.. ఆరోగ్య పరిస్థితిని చూసి ఆమె సహనటులు కొందరు, తేరా
యార్ హూన్ మెయిన్ సీరియల్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు
వచ్చారు. కానీ, కరోనాతో పోరాడి పోరాడి ఆరోగ్యం క్షీణించడంతో పరిస్థతి
విషమించి తుది శ్వాస విడిచారు. ఇక ఆమె భర్త గగన్ కూడా దివ్యకు కరోనా సోకిందని
తెలియడంతో ఆమెను వదిలివెళ్లినట్లు సమాచారం. దివ్య, గగన్‌ను ప్రేమించి 2019
డిసెంబర్‌లో తన కుటుంబానికి తెలియజేయకుండా వివాహం చేసుకుంది. దివ్యకు కరోనా
సోకడంతో తాను విడిచిపెట్టి, పరారీలో ఉన్నాననే వాదనలను గగన్ తిరస్కరించాడు. దివ్య
భట్నాగర్.. ఉడాన్, జీత్ గయి తోహ్ పియా మోర్రే, విష్
వంటి షోల్లో నటించింది.
ఇటీవల బాలీవుడ్ లో కూడా
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనాతో పోరాడి గెలిచి ఆరోగ్యంగా ఇంటికి వచ్చాడు. తెలుగు
సినీయర్ నటుడు రాజశేఖర్ కూడా కొద్ది రోజులు కరోనాతో పోరాడి గెలిచి ఆరోగ్యంగా బయటకు
వచ్చాడు. అటు ఇక కరోనా కారణంగా ఇటు తెలుగులో కూడా కొందరు ప్రముఖులు మరణించిన సంగతి
తెలిసిందే. ప్రముఖ సింగర్ బాలు కరోనాతో పోరాడి.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో
మరణించారు. ఇలా కరోనా ఈ సారి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మందిని పొట్టన
బెట్టుకోవడంతో పాటు అనేక ఇబ్బందులకు గురి చేసింది. లాక్ డౌన్ కారణంగా అనేక సినిమాల
షూటింగ్స్ లేకపోవడంతో వందల సంఖ్యలో సినీ కార్మికులు తీవ్ర కష్టాలు ఎదుర్కోన్నారు.