తెలంగాణాలో కరోనా బారిన పడిన మరొక ఎమ్యెల్యే
By: Sankar Sun, 08 Nov 2020 5:21 PM
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసుల సంఖ్య భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు రెండున్నర లక్షలు దాటిపోయాయి.
అలా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్.. తెలంగాణ ప్రజాప్రతినిధులను వెంటాడుతూనే ఉంది.. ఇప్పటికే హోంమంత్రి, మంత్రులు, డిప్యూటీ స్పీకర్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. ఇలా చాలా మంది కరోనాబారినపడ్డారు. ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. మహబూబాద్ జిల్లా మహబూబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.
ఆయనకి స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన కొద్ది రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారందరినీ క్వారెంటైన్ లోకి వెళ్లాలని కోరారు.