తెరాస ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ కు కరోనా పాజిటివ్
By: Sankar Wed, 23 Dec 2020 9:33 PM
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ గారికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఆయన రాజేంద్రనగర్‌కు ఎమ్మేల్యేగా వ్యవహరిస్తున్నారు.
గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ఎమ్మెల్యే తెలిపారు. గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు వెంటనే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
కరోనా చికిత్స చేయించుకుంటున్న కారణంగా కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరు ఫోన్ చేయొద్దని, అలాగే కలవటానికి కూడా ప్రయత్నించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పేర్కొన్నారు. అతడు త్వరగా కోలుకోవాలని పార్టీలోని నేతలు ప్రార్థిస్తున్నారు.