Advertisement

  • సచివాలయ కూల్చివేతపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన తెరాస

సచివాలయ కూల్చివేతపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన తెరాస

By: Sankar Wed, 08 July 2020 06:24 AM

సచివాలయ కూల్చివేతపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన తెరాస



తెలంగాణాలో కొత్త సచివాలయం నిర్మాణనానికి హైకోర్టు అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం పథ సచివాలయం కూల్చివేత పనిలో పడింది ..నిన్నటి అర్థరాత్రి నుంచి కూల్చివేత పనులు ప్రారంభం అయ్యాయి కూడా ..అయితే సచివాలయ కూల్చివేతపై ప్రతి పక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి ..కరోనా తో తెలంగాణ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇప్పుడు సచివాలయం కూల్చివేత చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి ..కూల్చివేసే బదులు కరోనా తాత్కాలిక ఆసుపత్రిగా వాడాలని సూచించాయి ..అయితే ప్రతిపక్షాల విమర్శలపై ప్రభుత్వం స్పందించింది ..మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ ఏర్పడి ఆరేళ్లవుతున్నా హైదరాబాద్‌పై ఏపీ పెత్తనం ఉండాలని కోరుకుంటున్నారా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వమే స్వచ్ఛందంగా, అధికారికంగా హైదరాబాద్‌లోని సెక్రటేరియేట్‌తోపాటు అన్ని ప్రభుత్వ భవనాలను అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదని గుర్తు చేశారు. ఏపీ సీఎంల వద్ద పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా అదే యావలో ఉన్నట్లు కనబడుతోందని ఎద్దేవా చేశారు.

కరోనా సమయంలోనూ ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాలు ఆగడం లేదని మంత్రి తలసాని అన్నారు. నూత‌న సచివాలయ నిర్మాణం కూడా ఆగదని మంత్రి స్పష్టం చేశారు. విపక్షాలు కేసీఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమ‌ని అన్నారు. బీజేపీ దిక్కు మాలిన రాజకీయాలు చేస్తోందని, మ‌త రాజకీయాలు తప్ప ఆ పార్టీకి ఇంకేం చేత కాదని విమర్శించారు.

కోర్టు తీర్పు ప్రకారమే సచివాలయాన్ని కడుతున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు షాన్ నిషాన్ ఉండేలా సచివాలయాన్ని కట్టి తీరుతామని స్పష్టం చేశారు. ప్రపతిక్ష నేత అరిచి గగ్గోలు పెట్టినా పట్టించుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష నేత చెబుతున్న సెక్షన్ 8 ఇప్పుడు వర్తించదన్నారు. అసెంబ్లీ నిర్మాణం కూడా త్వరలోనే జరుగుతుందని ఆయన చెప్పారు.

మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ద్రోహపూరితమైనదని అన్నారు . రాష్ట్ర అభివృద్ధిని విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని అన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజల చేతిలో ఆ పార్టీకి కుక్క చావు తప్పదని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ కడితే దిగమింగుకోలేక కొన్ని రోజులు ఏడ్చారని, ఇప్పుడు సచివాలయం కడుతుంటే పెడబొబ్బలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

Tags :
|

Advertisement